ఇంటర్వూ చేయాలా? అయిదు లక్షలు?

టాలీవుడ్ లో అప్పుడప్పుడు భలే చిత్రాలు జరుగుతుంటాయి. ఇదీ అలాంటి సిత్రమే. సినిమాల ప్రమోషన్ కు గ్రూప్ ఇంటర్వూలు చేయించడం కామన్. సినిమా డైరక్టర్ తోనో, హీరోతోనో, నిర్మాతతోనో పరిచయం వున్న సెలబ్రిటీలను కాస్త…

టాలీవుడ్ లో అప్పుడప్పుడు భలే చిత్రాలు జరుగుతుంటాయి. ఇదీ అలాంటి సిత్రమే. సినిమాల ప్రమోషన్ కు గ్రూప్ ఇంటర్వూలు చేయించడం కామన్. సినిమా డైరక్టర్ తోనో, హీరోతోనో, నిర్మాతతోనో పరిచయం వున్న సెలబ్రిటీలను కాస్త మొహమాట పెట్టి ఇలాంటి ఇంటర్వూలు చేయిస్తుంటారు. 

ఆ విధంగా యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ రాబట్టవచ్చు. అలా సాధ్యం కానపుడు యాంకర్ కు ఆమె రేంజ్ ను బట్టి ఫీజు ఇచ్చి ఇంటర్వూ చేయిస్తుంటారు.

రీసేంట్ గా ఓ చిన్న సినిమా యూనిట్ లో కీలక వ్యక్తి, ఓ సెలబ్రిటీని ఇలాంటి కోరికే కోరారు. తమ సినిమా యూనిట్ ను ఇంటర్వూ చేయమని అడిగారు. 

ఆ సెలబ్రిటీకి యూ ట్యూబ్ లో క్రేజ్ బాగానే వుంది. స్టేజ్ మీద చేసే ప్రసంగాలు కానీ, యూ ట్యూబ్ లో ఇంటర్వూలు కానీ బాగా పాపులర్ కదా,,అతగాడు ఇంటర్వూ చేస్తే బాగుంటుందని ఆలోచన.

అయితే తన క్రేజ్ ను ఊరికినే ఎందుకు వాడేయాలి? అందుకే అయిదులక్షల ఇంటర్వూ ఫీజు అడిగాడట సదరు సెలబ్రిటీ. దాంతో బిక్క మొహం వేసిన యూనిట్ సభ్యుడు, డబ్బులు కాదు కానీ గిఫ్ట్ ఇస్తాం అని అడిగారట. 

అబ్బే అలాంటివి కుదరవ్..రెమ్యూనిరేషన్ నే అంటూ కరాఖండీగా చెప్పేసరికి ఇక ఆ ఐడియాను డ్రాఫ్ చేసుకున్నారని బోగట్టా.