తెలంగాణలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ తెరాసా పార్టీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య సొంత పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ నా అడ్డ అని ఇక్కడ ఎవరిని అడుగు పెట్టనివ్వనని శపథం చేశారు.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం, చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలోని ఒక పార్టీ కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు ఘన్ పూర్ లో 361 నక్సలెట్లను పొట్టనబెట్టుకురని. ఎంతో మంది ప్రాణాలు తీశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కడియంతో అభివృధి జరగదని.. ఎమ్మెల్యేలతోనే అభివృధి జరుగుతుందన్నారు. కేసీఆర్ దేవుడు అయితే నేను పూజారిని అని అన్నారు.
తనపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజయ్య గెలుపుకోసము అందరం కష్టపడ్డం అని ఇప్పుడు అందరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. సభలకు తాగి వెళ్లి, నోటికి వచ్చినట్టు మాట్లడూతున్నారని, ఎమ్మెల్యే అవినీతి మొత్తం నా దగ్గర ఉందటూ ఇంకోసారి నాపై ఆరోపణలు చేసే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చారించారు.
గత కొంత కాలంగా స్టేషన్ ఘన్ పూర్ లో ఇరువురి నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇవాళ ఒకసారిగా కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ఎటువైపు దారి తీస్తాయో.