విజయ్ రేసింగ్ కి 10 కోట్లు

ఈ మధ్య సినిమాల్లో క్వాలిటీ, అవసరం వుంటే ఎంతయినా ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. ఈ విషయంలో హీరో మార్కెట్ ను కాస్త క్రాస్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. లేటెస్ట్ గా మైత్రీమూవీస్ హీరో…

ఈ మధ్య సినిమాల్లో క్వాలిటీ, అవసరం వుంటే ఎంతయినా ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. ఈ విషయంలో హీరో మార్కెట్ ను కాస్త క్రాస్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. లేటెస్ట్ గా మైత్రీమూవీస్ హీరో విజయ్ దేవరకొండతో నిర్మించే హీరో చిత్రం కోసం పది నుంచి ఇరవై నిమషాల మధ్యలో వుండే ఎపిసోడ్ చిత్రీకరణ కోసం పది కోట్లకు పైగా ఖర్చుచేసారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపిస్తాడు. సినిమాలో రెండుసార్లు వచ్చే బైక్ రేస్ సన్నివేశాలను ఇరవై రోజుల పాటు ఢిల్లీలోని ఫార్ములా వన్ రేస్ ట్రాక్ మీద చిత్రీకరించారు. ఇందుకోసం విదేశీ నిపుణులు, చిత్రీకరణ సామగ్రిని రప్పించారు. వీరుకాక దేశంలో వున్న టాప్ బైక్ రేసర్లను రప్పించారు.

రోజుకు 12లక్షల వంతున ఫార్ములా వన్ ట్రాక్ వాడుకోవడానికి చెల్లించారు. అయిదుగురు విదేశీ నిపుణులకు భారీగా పే చేయాల్సి వచ్చింది. ఖరీదైన బైక్ లు వాడాల్సి వచ్చింది. అన్నీ కలిసి పది కోట్లకు పైగా ఖర్చు చేసారట. అయితే సినిమాలో కీలకమైన ఖర్చు ఇదే. ఇదికాక విదేశంలో పాటల చిత్రీకరణ.

మిగిలిన ఖర్చు అంతా నార్మల్ రేంజ్ లోనే వుంటుందట. అందువల్ల సినిమా మొత్తానికి 50 కోట్ల వరకు అవుతుందని వినిపిస్తోంది.

సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా  సినిమా రివ్యూ: కల్కి