హరి..హర..ఇంకా బోలెడుంది

మనం ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నట్లు వుంది హరి హర వీరమల్లు వ్యవహారం. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఆ సినిమా అలా వుండిపోయింది. దీని తరువాత ఒప్పుకున్న వకీల్ సాబ్, భీమ్లా…

మనం ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నట్లు వుంది హరి హర వీరమల్లు వ్యవహారం. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఆ సినిమా అలా వుండిపోయింది. దీని తరువాత ఒప్పుకున్న వకీల్ సాబ్, భీమ్లా నాయక్ బయటకు వచ్చేసాయి. ఇది మాత్రం అలాగే వుంది. 

ఇది ఇలా వుండగానే మరో రెండు సినిమాలకు పచ్చ జెండా ఊపేసారు. అక్టోబర్ నుంచి రాజకీయ యాత్రకు వెళ్తున్నా అంటున్నారు. మరి ఈ హరి హర వీరమల్లు ఏమవుతుందో? ఎన్నో అన్యాయాల మీద ప్రశ్నించాలి అనే పవన్, తన నిర్మాత ఎఎమ్ రత్నం కష్టాలను మాత్రం పట్టించుకోరు.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం హరి హర వీరమల్లు సినిమా ఇంకో యాభై శాతం షూటింగ్ పెండింగ్ లో వుందట. అది కూడా చాలా కీలకమైన యాక్షన్ బ్లాకులు అన్నీ ఇంకా అలాగే వున్నాయట. అవన్నీ చేయాలంటే కాస్త ఎక్కవ సమయమే పడుతుందట. మరి ఈ లెక్కన ఈ సినిమాకు పవన్ ఎన్ని రోజులు కేటాయించాలో, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియడం లేదట.

హరి హర వీరమల్లు పోగ్రెస్ ఇలా వుంటే ఇంకా వేరే గ్యాసిప్ లు కూడా వినిపిస్తూనే వున్నాయి. సినిమా అనుకున్నట్లు రావడం లేదని పవన్ ఫీలవుతున్నారని ఓ గ్యాసిప్. అది కాదు, అంత భారీ ఫైట్లు, డ్యాన్స్ లు వద్దు తగ్గించమన్నారని మరో గ్యాసిప్. 

పాపం, దర్శకుడు క్రిష్ టైమ్ బాగున్నట్లు లేదు. మహానాయకుడు, కథానాయకుడు బోలెడు సమయం తీసేసుకున్నాయి. తరువాత తలకెత్తుకున్న హరిహర అలా పడి వుంది. ఈ మధ్యలో ట్రయ్ చేసిన కొండపొలం కొండెక్కేసింది.