`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` వినోదం పంచుతుంది

పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. జాతి రత్నాలు'తో…

పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. జాతి రత్నాలు'తో బ్లాక్‌ బస్టర్‌ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. 

శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలోఅనుదీప్ విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
అలా మొదలైంది

ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని వుండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు వుంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్ వున్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి..'ఖుషి' సినిమా నేపధ్యాన్ని తీసుకుని ఈ కథని చెబుతున్నాం. నా జీవితానికి కూడా చాలా దగ్గరగా వుంటుంది. టికెట్స్, ఫ్యాన్స్ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే.

జాతి రత్నాలు తర్వాత 

నేను పెద్దగా లెక్కలు వేసుకొను. సినిమా చేసినప్పుడు మజా రావాలి. అంతే. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది. హీరోగా నటించిన శ్రీకాంత్ నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ వుంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ వుంటుంది. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`లో కూడా హిలేరియస్ హ్యుమర్ వుంటుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ఆ అంచనాలకు తగ్గట్టే వుంటుంది. కొత్తవాళ్ళు అంతా చక్కగా చేశారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి అనుభవజ్ఞులు కూడా వున్నారు.

శివకార్తికేయన్ సినిమా

మొదట నేనే దర్శకత్వం చేయాలని అనుకున్నా. అయితే నాకు కొంత లైనప్ వుంది. నా సహాయ దర్శకులకు కథ బాగా నచ్చడంతో వారికి ఇవ్వడం జరిగింది. వంశీ మరో దర్శకుడు వుంటే బావుందని అన్నారు. అలా లక్ష్మీ నారాయణ మరో దర్శకుడిగా వచ్చారు. నేను షూటింగ్ లో లేను కానీ స్క్రిప్ట్, ఎడిటింగ్, నేపధ్య సంగీతం ఇలా చాలా అంశాలలో నా ఇన్వాల్మెంట్ వుంది. ఈ సినిమా ఫలితం విషయంలో నా భాద్యత వుంటుంది.

శివకార్తికేయన్ ప్రిన్స్ 

పాండిచ్చేరి నేపధ్యంలో సాగే కథ అది. షూటింగ్ దాదాపు పూర్తయింది. దీపావళి రిలీజ్ వుంటుంది. అది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. హ్యుమర్ కూడా వుంటుంది.