కుండబద్దలు కొట్టిన బాలయ్య

టాలీవుడ్ నటీనటుల సంఘం 'మా' ఎన్నికల వ్యవహారం మీద సీనియర్ హీరో బాలయ్య కుండ బద్దలు కొట్టారు.  Advertisement ఇప్పటి దాకా భవనం కట్టుకోలేకపోయామని, కొందరు ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, అలా తిరిగి…

టాలీవుడ్ నటీనటుల సంఘం 'మా' ఎన్నికల వ్యవహారం మీద సీనియర్ హీరో బాలయ్య కుండ బద్దలు కొట్టారు. 

ఇప్పటి దాకా భవనం కట్టుకోలేకపోయామని, కొందరు ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, అలా తిరిగి సాధించింది ఏమిటి అని చిరు-నాగ్ తదితరులను పరోక్షంగా విమర్శించారు. 

అందరూ కలిస్తే ఇంద్రభవనం నిర్మించుకోవచ్చు అని, మంచు విష్ణుకు ఈ విషయంలో తాను మద్దతు ఇస్తున్నానని ఆయన స్పష్టం చేసారు. 

దీంతో మా సంఘం ఎన్నికలు టాలీవుడ్ లోని రెండు వర్గాలను క్లారిటీగా చూపించేసినట్లు అయింది. మెగాస్టార్ మద్దతుతో ప్రకాష్ రాజ్, బాలయ్య-మోహన్ బాబు-కృష్ణ లాంటి సీనియర్ల మద్దతు తో మంచు విష్ణు ఢీకొంటారని అర్థం అయిపోతోంది. 

బాలయ్య తన మద్దతును విష్ణుకు ప్రకటించడం అన్నది ఎన్నికల విషయంలో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. 

అమెరికా పర్యటనల మీద, ప్రభుత్వంతో చెట్టపట్టాల మీద బాలయ్య కామెంట్లు చేసినా, ఈ విమర్శలు మెగా క్యాంప్ నుంచి ప్రతి స్పందన వస్తుందని అనుకోవడానికి లేదు.