టాలీవుడ్ నటీనటుల సంఘం 'మా' ఎన్నికల వ్యవహారం మీద సీనియర్ హీరో బాలయ్య కుండ బద్దలు కొట్టారు.
ఇప్పటి దాకా భవనం కట్టుకోలేకపోయామని, కొందరు ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, అలా తిరిగి సాధించింది ఏమిటి అని చిరు-నాగ్ తదితరులను పరోక్షంగా విమర్శించారు.
అందరూ కలిస్తే ఇంద్రభవనం నిర్మించుకోవచ్చు అని, మంచు విష్ణుకు ఈ విషయంలో తాను మద్దతు ఇస్తున్నానని ఆయన స్పష్టం చేసారు.
దీంతో మా సంఘం ఎన్నికలు టాలీవుడ్ లోని రెండు వర్గాలను క్లారిటీగా చూపించేసినట్లు అయింది. మెగాస్టార్ మద్దతుతో ప్రకాష్ రాజ్, బాలయ్య-మోహన్ బాబు-కృష్ణ లాంటి సీనియర్ల మద్దతు తో మంచు విష్ణు ఢీకొంటారని అర్థం అయిపోతోంది.
బాలయ్య తన మద్దతును విష్ణుకు ప్రకటించడం అన్నది ఎన్నికల విషయంలో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.
అమెరికా పర్యటనల మీద, ప్రభుత్వంతో చెట్టపట్టాల మీద బాలయ్య కామెంట్లు చేసినా, ఈ విమర్శలు మెగా క్యాంప్ నుంచి ప్రతి స్పందన వస్తుందని అనుకోవడానికి లేదు.