కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, బీజేపీ అధినాయకత్వం తెలుగు రాష్ట్రల్లోని సిని ప్రముఖులను, మేధావులను కలుస్తు బీజేపీని ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. అందుకే బహుశ గతం వారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జూ. ఎన్టీఆర్ తో మీటింగ్ ఆ తరువాత ఇవాళ టాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరో నితిన్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలవబోతున్నారు అని వార్తలు వాస్తున్నాయి.
రాజకీయాలకు అసలు సంబంధం లేని వ్యక్తులను బీజేపీ పెద్దలు కలుస్తూ చర్చలు జరుపుతున్నారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అసలు పట్టించుకోక పోవడన్ని జనసేన పార్టీ నేతలతో పాటు, అభిమానులు కూడా తెగ భాదపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బోలేడు మంది అభిమానులు ఉన్నరని, నేను ఒక పిలుపు ఇస్తే రాజకీయంగా తిరుగుండదని అలోచించి రాజకీయల్లోకి వచ్చి రెండు చోట్ల పోటీ చేసి ఘోరా ఫరాభవం చెందిన ఎక్కడ తగ్గకుండా రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను బీజేపీ ఎందుకు పట్టించుకోలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఒక వైపు బీజేపీతో జనసేన పొత్తు ఉండి కూడా పవన్ కళ్యాణ్ ను కలవకపోవడం నిజంగా పవన్ ను అవమానించడంమే అవుతుంది. కనీసం మర్యాద పుర్వాకంగా ఏదో ఒక జాతీయ బీజేపీ నేత కలిస్తే జనసైనికులు కనీసం ట్వీటర్ లో అయిన గోప్పలు చెప్పుకుంటారు కదా అనేది ప్రతిపక్షల నుండి వస్తున్నా మాటలు.
టాలీవుడ్ లో అందరిని కలిసి పవన్ తో బీజేపీ నేతలు కలవడం వెనుక బలమైన కారణాలు ఉంటాయి అంటూన్నారు బీజేపీ రాజనీతి గురించి తెలిసినవారు.