సీఎం ఎమ్మెల్యే పదవి రద్దు!

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలింది. త‌న‌కు త‌నే గనుల‌ను కేటాయించుకోని అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. కేంద్ర‌ ఎన్నికల కమిషన్ సూచన…

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలింది. త‌న‌కు త‌నే గనుల‌ను కేటాయించుకోని అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. కేంద్ర‌ ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు.

శాసనసభ సభ్యత్వం రద్దయినా కూడా హేమంత్ సోరెన్‌ సీఎంగా కొనసాగవచ్చు. అయితే మరో ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది.

కాగా, జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వం ఉంది. జేఎంఎంకు 30 మంది, కాంగ్రెస్ కు 17 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉండగా..  ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

గ‌త 22 ఏళ్ల‌లో జార్జండ్ చ‌రిత్ర‌లో ఏ ముఖ్య‌మంత్రి ప‌ద‌వీకాలం పూర్తికాక‌పోవ‌డం ఇది 11వ సారి అవుతుంది. ఇన్నేళ్ల‌లో ఒకే ఒక్క సీఎం త‌న ప‌ద‌వీ కాలం పూర్తి చేశారు. బీజేపీ ప్ర‌భుత్వ హ‌యంలో సీఎంగా ఉన్న ర‌ఘ‌బ‌ర్ దాస్ మాత్ర‌మే ప‌ద‌వి పూర్తి చేయ‌గ‌లిగారు.