సంజయ్ రామస్వామి…హవీష్

ఎడ్యుకేషన్ రంగంలో సక్సెస్ ఫుల్ గా వుంటూ సినిమా రంగంలో కూడా ఎప్పటికైనా ఓ స్టేజ్ కు రావాలని ప్రయత్నిస్తున్నాడు హవీష్.  Advertisement సెవెన్ సినిమాతో హిట్ కొట్టిన తరువాత మళ్లీ హీరోగా చేయలేదు.…

ఎడ్యుకేషన్ రంగంలో సక్సెస్ ఫుల్ గా వుంటూ సినిమా రంగంలో కూడా ఎప్పటికైనా ఓ స్టేజ్ కు రావాలని ప్రయత్నిస్తున్నాడు హవీష్. 

సెవెన్ సినిమాతో హిట్ కొట్టిన తరువాత మళ్లీ హీరోగా చేయలేదు. ఈ లోగా నిర్మాతగా కొన్ని సినిమాలు చేసాడు. లేటెస్ట్ గా ఓ ప్రాజెక్టు టేకప్ చేయబోతున్నాడు. దర్శకుడు నక్కిన త్రినాధరావుతో త్వరలో సినిమా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంజయ్ రామస్వామి అని టైటిల్ పెట్టారు. ప్రస్తుతం హీరో రవితేజ తో నక్కిన త్రినాధరావు ‘ఢమాకా’ సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన తరువాత ఈ సినిమా చేయాలన్నది ఒప్పందం. ఈ సినిమాకు కథ మాత్రం నక్కినది కాదు. వేరే కథను తీసుకుని నక్కిన చేత డైరక్షన్ చేయిస్తున్నారు.

కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తారు. హవీష్ తండ్రి అయిన కోనేరు సత్యనారాయణ ఇటీవలే ఖిలాడీ సినిమాను రవితేజ హీరోగా నిర్మించారు.