చంద్రబాబు 33 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఉన్న కుప్పంని ఎటువంటి అభివృధి చేయాలేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ కుప్పం జారిపోతుంది.. కూలిపోతుంది అనే ఆవేదన చంద్రబాబులో సృష్టంగా కనిపిస్తోందన్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పం మున్సిపల్, జిల్లా పరిషత్, సర్పంచ్.. ఏ ఎన్నికల్లో కూడా డిపాజిట్లు రాలేదని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు కూడా భంగపాటు తప్పదన్నారు.
కుప్పం బ్రాంచ్ కెనాల్ ను చంద్రబాబు హయంలో ఎందుకు పూర్తి చేయాలేదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కుప్పంనికి ఎటువంటి పనులు చేయకుండా ఇప్పుడు డ్రామాలు అడుతున్నరంటూ మండిపడ్డారు. కుప్పం అంటే చంద్రబాబుకు భయం అందుకే పదేపదే వెళ్తున్నారు.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కవు అంటావ్.. అందుకే బహుశ తెలుగుదేశం పార్టీ దీపం అరిపోతోందని చంద్రబాబు తెగ భాదపడిపోతున్నరంటూ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూడా లోకేష్ కు మంగళగిరిలో ఎలా జరిగిందో చంద్రబాబుకు కుప్పంలో కూడా అదే రిపిట్ అవుతున్నారు.