ఇవాళ పదవీ విరమణ చేయబోతున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ చివరి విచారణ రోజును పురస్కరించుకుని సుప్రీం కోర్టులో విచారణలో ఉన్న కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ముందుగా రాజకీయా నాయకుల ఉచితా హమిలపై వాదనలు వినబోతున్నారు సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.
ఎన్నికలకు ముందు ఉచితాల హామిలను ఇచ్చే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యంత ముఖ్యమైన ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఇవి ఉచితాలు కావని, ప్రజలకు సంక్షేమ పథకాలని పలు రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. ఇదే కేసులో సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్ కోరినందున కేసును వేరే బెంచ్‌కు పంపడంపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
రాజకీయ పార్టీల సంబంధించి ఇలాంటి తీవ్రమైన అంశంపై చర్చించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశానికి ఎందుకు రాజకీయ పార్టీలను పిలవలేదని బుధవారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఉచితాలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటే తప్ప, ఏమీ జరగదని సుప్రీంకోర్టు పేర్కొంది. “ఉచితాలపై తప్పకుండా చర్చ జరగాలి.ఈ సమస్య తీవ్రమైనది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ప్రశ్న ఏమిటంటే, అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఈ సమస్యపై కలవకూడదు, భారత ప్రభుత్వం సమావేశానికి పిలచి కలిసి నిర్ణయం తీసుకోవాలని” అని కోర్టు పేర్కొంది.