రవితేజ..ఈగిల్

వరుసగా సినిమాలు సైన్ చేస్తున్న హీరో ఎవరు అంటూ అందరి కన్నా ముందు వుంటాడు రవితేజ. ఇప్పటికే చేతిలో ఢమాకా, రావాణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు వున్నాయి.  Advertisement ఢమాకా దాదాపు పూర్తి అయినట్లే.…

వరుసగా సినిమాలు సైన్ చేస్తున్న హీరో ఎవరు అంటూ అందరి కన్నా ముందు వుంటాడు రవితేజ. ఇప్పటికే చేతిలో ఢమాకా, రావాణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు వున్నాయి. 

ఢమాకా దాదాపు పూర్తి అయినట్లే. రావణాసుర మరి కొద్ది రోజుల్లో పూర్తవుతుంది. మరో నెల తరువాత టైగర్ నాగేశ్వరరావు సినిమా మాత్రమే బకాయి వుంటుంది. ఇలాంటి నేపథ్యంలో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు రవితేజ.

మంచి సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో దర్ళకుడిగా మారుతున్నాడని తెలుస్తోంది. ఢమాకా సినిమాను నిర్మిస్తున్న పీపుల్స్ మీడియానే ఆ సినిమాను కూడా నిర్మిస్తుంది. ఈ సినిమా విదేశాల్లో కూడా కాస్త ఎక్కువ షూట్ వుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం డైరక్టర్ అండ్ టీమ్ ఈ రెక్కీ పని మీదే విదేశాల్లో వున్నారు. ఈ సినిమా స్టయిలిష్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాగు ఈగిల్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది రవితేజ నుంచి ఢమాకా సినిమా ముందుగా  వస్తుంది. నక్కిన త్రినాధరావు సినిమా ఇది. దాని తరువాత సుధీర్ వర్మ రూపొందిస్తున్న అభిషేక్ నామా సినిమా రావణాసుర వుంటుంది.