కరోనా ఫేజ్ 2 తరువాత సినిమాలు రావాలా వద్దా అని కిందా మీదా అవుతుంటే, ధైర్యంగా డేట్ వేసాడు 'తిమ్మరసు'. జూలై 30 న విడుదల. కానీ ఇప్పుడు ఆ చిన్న సినిమా తిమ్మరసు మీద పిడుగులా పడబోతున్నాడు 'టక్ జగదీష్'. నాని హీరోగా తయారైన ఈ సినిమాను జూలై 30 న విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది
నెలాఖరు లోగా సెకెండ్ షో లకు అనుమతి వస్తుందని సినిమా జనాలు భావిస్తున్నారు. ఇక అక్కడికి సమస్య ఒక్క టికెట్ రేట్లు మాత్రమే. యాభై శాతం అన్నది పెద్ద సమస్య కాబోదు. ఆ సమస్య మీద కూడా టాలీవుడ్ జనాలు ఏదో విధంగా సిఎమ్ జగన్ ను కలిసి సానుకూల నిర్ణయం తెచ్చుకునే ప్రయత్నంలో వున్నారు.
ఈ నేపథ్యంలో ఎవరికి వారు డేట్ లు డిసైడ్ చేసుకుంటున్నారు. థర్డ్ వేవ్ వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రెడీ అయిపోయిన సినిమాల భారం దించుకోవాలని చూస్తున్నారు. ఆగస్ట్ లో ఫుల్ గా సినిమాలు రాబోతున్నాయి.
అందుకే టక్ జగదీష్ ను ఈ నెల 30 వేసేయాలనే ఆలోచన మొదలైంది. దీంతో చిన్న సినిమా తిమ్మరసు పరిస్థితి ప్రశార్ధకమైంది. ఎందుకంటే థియేటర్లు ఓపెన్ కాగానే తిమ్మరసు..టక్ జగదీష్ రెండూ వుంటే నాచురల్ గా టక్ జగదీష్ కు ఎడ్జ్ వుంటుంది.
మరి ఈ విషయంంలో గిల్డ్ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే ముందుగా డేట్ తిమ్మరసు ప్రకటించింది కనుక, టక్ జగదీష్ ను ఆగమంటారో? రెండు సినిమాల వరకు ఒకె కనుక వదిలేస్తారో?