అప్పర..రచ్చ..రచ్చ

ఆర్జీవీ స్క్రీన్ మీదకు తీసుకువచ్చిన అప్సర రాణి ఇప్పుడు టాలీవుడ్ ఫేవరట్ ఐటమ్ గర్ల్ అయిపోయేలా వుంది చూస్తుంటే. ఈ మధ్యనే క్రాక్ లో 'భూ..బదల్..' అంటూ హల్ చల్ చేసింది.  Advertisement లేటెస్ట్…

ఆర్జీవీ స్క్రీన్ మీదకు తీసుకువచ్చిన అప్సర రాణి ఇప్పుడు టాలీవుడ్ ఫేవరట్ ఐటమ్ గర్ల్ అయిపోయేలా వుంది చూస్తుంటే. ఈ మధ్యనే క్రాక్ లో 'భూ..బదల్..' అంటూ హల్ చల్ చేసింది. 

లేటెస్ట్ గా సంపత్ నంది 'సీటీమార్' లో పెప్సీ ఆంటీగా చిందులు వేసింది. ' నా పేరే పెప్సీ ఆంటీ ' అంటూ దర్శకుడు సంపత్ నంది నే రాసిన స్పైసీ సాంగ్ విడియో ఫుటేజ్ ను బయటకు వదిలారు. 

ఈ పాటలో అప్సర చిందులు మామూలుగా లేవు. ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ డైరక్షన్ లో అప్పర వేసిన చిందులు కచ్చితంగా ఆ సినిమాకు అస్సెట్ అయ్యేలాగే వున్నాయి. మొన్నటికి మొన్నే జ్వాలా రెడ్డి సాంగ్ తో తమన్నా ఓ ఊపు ఊపింది. అది చాలదు అన్నట్లు ఇప్పుడు పెప్సీ ఆంటీ అంటూ అప్పర వచ్చేసింది.

చూస్తుంటే డౌన్ ఫాల్ లో వున్న గోపీచంద్ తో చేస్తున్న సినిమాకు కలర్ ఎలా తేవాలి అన్న విషయంలో దర్శకుడు సంపత్ నంది గట్టిగానే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. మణిశర్మ సంగీతంలో వచ్చిన పాట ట్యూన్ పెద్ద గొప్పగా లేకపోయినా, పాటలో దొర్లిన మాటలు భలేగా వున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలవుతోంది.