ఎక్స్ క్లూజివ్..కొత్తకథతో కొరటాల-ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు? అన్న ప్రశ్న అభిమానులను వెంటాడుతూనే వుంది. కొరటాల డైరక్షన్ లో చేయబోయే సినిమా ఎందుకు ఆలస్యమవుతోంది అన్న అనుమానం కూడా వుండనే వుంది. ఈ రెండింటికీ సమాధానమే…

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు? అన్న ప్రశ్న అభిమానులను వెంటాడుతూనే వుంది. కొరటాల డైరక్షన్ లో చేయబోయే సినిమా ఎందుకు ఆలస్యమవుతోంది అన్న అనుమానం కూడా వుండనే వుంది. ఈ రెండింటికీ సమాధానమే ఇది. 

ఆర్ఆర్ఆర్ తరువాత పాన్ ఇండియా కథతో సినిమా చేయాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. అందుకే అంతకు ముందు అనుకున్న కథను పక్కన పెట్టారు. తన దగ్గర వున్న ఓ కొత్త పాయింట్ తో పాన్ ఇండియా లెవెల్ కథను కొరటాల తయారు చేస్తున్నారు. ఈ కథ రెడీ కాగానే సెట్ మీదకు వెళ్తారు.

బహుశా నవంబర్ నుంచి ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా షూట్ వుండొచ్చని తెలుస్తోంది. కొరటాల కొత్తగా అల్లుతున్న కథ కొంత భాగం సముద్రం మీద, షిప్ ల మీద కూడా నడుస్తుందని తెలుస్తోంది. కథలో మాఫియా బ్యాక్ డ్రాప్ వుంటుందని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. ఇవన్నీ వింటూ వుంటే కొరటాల తను చేయబోయే ఎన్టీఆర్ సినిమా కోసం భారీ బ్యాక్ డ్రాప్ నే రెడీ చేసినట్లు కనిపిస్తోంది.

పాన్ ఇండియా సినిమా అంటే యాక్షన్ జానర్ అన్నది పెర్ ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అందుకే ఈ దారిలో కథ అల్లుకుంటున్నారు అనుకోవాలి. మొత్తం మీద కొరటాల-ఎన్టీఆర్ సినిమా గురించి ఏమీ తెలియక కిందా మీదా అవుతున్న ఫ్యాన్స్ కు ఇది కిక్ ఇచ్చే అప్ డేట్ నే.