నాని బండ్రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు.
ఇప్పటి వరకు ఈ చిత్రంలో నటించే నూతన హీరో, హీరోయిన్స్ ప్రచార చిత్రాలను గోప్యంగా వుంచిన చిత్రం బృందం ఫస్ట్‌లుక్‌లో ఈ చిత్రం హీరో, హీరోయిన్ లను రివీల్ చేసింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సోషల్‌మీడియా వేదికపై విడుదల చేశారు.
దర్శకుడు నాని చిత్ర విశేషాలను తెలియజేస్తూ పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందరికి కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ జూన్ 10 నుంచి రెండవ షెడ్యూల్‌ను రాజమ్రండి, వైజాగ్‌లో చిత్రీకరిస్తాం. సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్ డీఓపీ: ముఖేష్.జి, శక్తి అరవింద్, సాహిత్యం: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, శ్రీమణి.