ఫ్రస్టేషన్ హిట్ ఎఫ్ 3

భారీ భారీ డైలాగులు….భారీ భారీ ఫైట్లు… హెవీ ఎమోషన్లు, అంతకు మించిన ఎలివేషన్లు….కరోనా అనంతరం ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ దాదాపుగా ఇవే. జనం మెంటలెక్కిపోయి వున్నారు ఎంటర్ టైన్ మెంట్ కరువై.  …

భారీ భారీ డైలాగులు….భారీ భారీ ఫైట్లు… హెవీ ఎమోషన్లు, అంతకు మించిన ఎలివేషన్లు….కరోనా అనంతరం ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ దాదాపుగా ఇవే. జనం మెంటలెక్కిపోయి వున్నారు ఎంటర్ టైన్ మెంట్ కరువై.  

వినోదం, పైసా వసూలు అని పేరు చెప్పి వచ్చిన పెద్ద సినిమాలు కూడా ఆ మాట నిలబెట్టుకోలేదు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో వచ్చింది అచ్చమైన ఇవివి, భీమినేని సుడిగాడు మార్కు సినిమా.

అనిల్ రావిపూడి ఫన్ తప్ప మరేమీ పట్టించుకోకుండా తీసిన ఎఫ్ 3. ఇప్పుడు. ఈ సినిమా శుక్ర, శని వారాల్లో క్రౌడ్ పుల్లర్ గా నిలవడానికి కారణం అదే. రెండేళ్ల కోవిడ్ పరిస్థితులు. ఆ తరువాత వచ్చిన భారీ సినిమాలు. 

ఇవన్నీ కలిపి సినిమాల మీద ఫ్రస్టేషన్ ను కలిగించాయి ప్రేక్షకులకు.దీంతో థియేటర్ కు దూరంగా వుండిపోయారు. జనం ఎందుకు దూరంగా వున్నారో తెలియక కిందా మీదా అయ్యారు మేకర్లు.

ఇప్పుడు ఎఫ్ 3 వచ్చింది. కొంతమంది సూపర్ అన్నారు. మరికొంత మంది ఓకె అన్నారు. ఇంకొంత మంది ఫస్టాఫ్ సూపర్..సెకండాఫ్ ఓకె అన్నారు. నిర్మాత దిల్ రాజు ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంజాయ్..సెకెండాఫ్ ఎపిసోడ్ ఎపిసోడ్ లుగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు.  

ఇలా రకరకాల ఒపీనియన్లు వున్నా జనాలు మాత్రం రెండు రోజులు థియేటర్ కు బాగానే వచ్చారు. సండే కూడా అలాగే ట్రెండ్ కనిపిస్తోంది. అంటే సరైన ఫన్ సినిమా కోసం ఎదురు చూసారని అర్థం అవుతోంది.  

చూస్తుంటే ఫన్ బేస్డ్ సినిమాలు మరి కొన్ని త్వరగా రెడీ అవుతాయోమో? కానీ మళ్లీ పక్కాగా ఇవివి స్టయిల్ ను వడిసిపట్టుకోవాలి..అది అసలు పాయింట్. అందరూ అనిల్ రావిపూడి లు కాలేరుగా.