కరోనా నేపథ్యంలో సినిమాల విడుదలలు ఇబ్బందుల్లో పడ్డాయి కానీ మేకింగ్ మాత్రం ఎలాగో అలా బండి లాగించేస్తున్నారు.
ప్రతి హీరో ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు ఫినిష్ చేసి, మరో సినిమా మీదకు వెళ్లే స్టేజ్ లో వున్నారు. హీరో నాగశౌర్య కూడా రెండు సినిమాలు ఫినిష్ చేసేసాడు.
సితార బ్యానర్ లో వరుడుకావలెను పూర్తయిపోయింది.పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆసియన్ సినిమాస్ బ్యానర్ లో లక్ష్య సినిమా క్లయిమాక్స్ మినహా అంతా పూర్తయింది.
ఇప్పుడు తన స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ అనీష్ కృష్ణ డైరక్షన్ లో నిర్మించే సినిమాను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు.
హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ లో ఫైట్ సీక్వెన్స్ తో ఈ సినిమా రెండోషెడ్యూలు ప్రారంభమవుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ వరకు కంటిన్యూ షెడ్యూలుతో పూర్తవుతుంది.