థియేటర్ కార్మికుల ఆకలి కేకలు

దేవుడు వరమిచ్చినా పూజారి మోకాలు అడ్డినట్లు వుంది పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేసాయి. కానీ థియేటర్ల తలుపులు మాత్రం తెరచుకోవడం లేదు. చేపా..చేపా..ఎందుకు ఎండలేదు అంటే….అన్నట్లు వుంది…

దేవుడు వరమిచ్చినా పూజారి మోకాలు అడ్డినట్లు వుంది పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేసాయి. కానీ థియేటర్ల తలుపులు మాత్రం తెరచుకోవడం లేదు. చేపా..చేపా..ఎందుకు ఎండలేదు అంటే….అన్నట్లు వుంది వ్యవహారం. 

ఎలాగూ సినిమాలు లేవు..ఇప్పుడు తీసి ఏం సాధించాలని అని థియేటర్ల యజమానులు, థియేటర్లు పూర్తిగా తెరవకుండా సినిమాలు వదిలేది ఎలా అని నిర్మాతలు..ఎవరికి వారు సైలంట్ గా వున్నారు. 

ఇదే అదను తమ డిమాండ్ లు సాధించాలని థియేటర్ల యజమానులు, ఎందుకొచ్చిన తలకాయనొప్పి ఒటిటికి ఇచ్చేస్తే సరికదా అని నిర్మాతలు కూర్చున్నారు. మధ్యలో నలిగిపోతున్న థియేటర్ కార్మికులు ఆకలి కేకలతో రోడ్డు ఎక్కారు. 

తమను ఆదుకోవాలని, లేదా థియేటర్లు తెరవాలని ప్లకార్డులు పట్టుకుని హైదరాబాద్ లో ప్రదర్శనలు నిర్వహించారు. కరోనా ఫస్ట్ ఫేజ్ టైమ్ లో ఎవరో ఒకరు ఎంతో కొంత థియేటర్ కార్మికులను ఆదుకున్నారు. 

కానీ సెకండ్ ఫేజ్ లో అలాంటి ఉదార కార్యక్రమాలన్నీ పక్కన పెట్టారు. దీంతో పాపం, బడుగు ఉద్యోగులు అయిన థియేటర్ కార్మికులు ఆకలితో పస్తులు వుండాల్సివస్తోంది.