తెలుగుదేశం నిస్సిగ్గు తనానికి పరాకాష్ట!

ఒకవైపు ఫిరాయింపుదారులకు పచ్చజెండా ఊపి పంపించింది చంద్రబాబు నాయుడే అనే అభిప్రాయం ప్రజల నుంచి గట్టిగా వినిపిస్తూ ఉంది. ఇలాంటి అంకం అమలు అయ్యే సమయానికి చంద్రబాబు నాయుడు తెలివిగా విదేశాలకు వెళ్లారనే అభిప్రాయం…

ఒకవైపు ఫిరాయింపుదారులకు పచ్చజెండా ఊపి పంపించింది చంద్రబాబు నాయుడే అనే అభిప్రాయం ప్రజల నుంచి గట్టిగా వినిపిస్తూ ఉంది. ఇలాంటి అంకం అమలు అయ్యే సమయానికి చంద్రబాబు నాయుడు తెలివిగా విదేశాలకు వెళ్లారనే అభిప్రాయం వినిపిస్తోంది. తను విదేశానికి వెళ్లి, ఇక్కడ తన వాళ్లను బీజేపీలోకి పంపించారు చంద్రబాబు నాయుడు అనే టాక్ నడుస్తూ ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆ ఫిరాయింపుదారుల మీద తెలుగుదేశం విరుచుకుపడి పోతూ ఉండటం మరో ఎత్తు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది అంటూ బీజేపీ మీద తెలుగుదేశం నేతలు ఒక రేంజ్లో ఫైర్ అయిపోతూ ఉన్నారు! బీజేపీకి విలువలు లేకుండా పోయాయంటూ వీళ్లు మాట్లాడుతూ ఉన్నారు.

ఫిరాయింపు.. విలువలు.. నైతికత.. ఇలాంటి అంశాల గురించి మాట్లాడాల్సింది తెలుగుదేశం పార్టీ మాత్రమే! ఆ పార్టీకి తప్ప ఈ టాపిక్ గురించి మాట్లాడే అర్హత మరెవరికీ లేదన్నట్టుగా ఆ పార్టీ నేతలు నీతులు చెబుతూ ఉన్నారు. ఆ నీతులు వింటుంటే సామాన్య ప్రజలకు కంపరం పుడుతూ ఉంది.

మొన్నటి వరకూ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు పచ్చపార్టీ కండువాలు వేసి, వారి సంతలో పశువుల్లా కొన్న పార్టీనే ఇప్పుడు ఫిరాయింపులు అనైతికం అంటూ మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. 
నలుగురు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరడం అనైతికం అంటూ పచ్చ బ్యాచ్ నైతికత గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారిపై అనర్హత వేటు వేయాలని వీరు డిమాండ్ చేసేస్తూ ఉన్నారు! దీనిపై న్యాయపోరాటం కూడా చేస్తారట!

అసలు ఇవన్నీ ఉత్త మాటలే, ఫిరాయింపుదారులను చంద్రబాబు నాయుడే దగ్గరుండి సాగనంపారు అనే టాక్ ఒకవైపు అయితే, అధికారం చేతిలో ఉన్నంతసేపూ అడ్డగోలుగా ఫిరాయింపులు చేయించి, ఇప్పుడు ఇలా టీడీపీనే గోల పెడుతూ ఉండటం మరో కామెడీ! తెలుగుదేశం నిస్సిగ్గుతనానికి ఇది పరాకాష్ట అని పరిశీలకులు అంటున్నారు.

పవన్ ఓటమికి మరెవరూ కారణం కాదు.. పవన్ కల్యాణే