తమవాళ్లు దోచేశారని టీడీపీ ఒప్పుకుంటున్నట్టే!

'అవినీతి సొమ్ములను కాపాడుకోవడానికే బీజేపీలోకి వెళ్తున్నారు..' 'కేసుల నుంచి తమను తాము కాపాడుకోవడానికే కమలం పార్టీలోకి చేరారు..' 'బీజేపీలోకి ఫిరాయిస్తున్న వారు అవినీతి పరులు మాత్రమే..' ఇవీ తెలుగుదేశం నేతలు చేస్తున్న కామెంట్లు. తెలుగుదేశం…

'అవినీతి సొమ్ములను కాపాడుకోవడానికే బీజేపీలోకి వెళ్తున్నారు..' 'కేసుల నుంచి తమను తాము కాపాడుకోవడానికే కమలం పార్టీలోకి చేరారు..' 'బీజేపీలోకి ఫిరాయిస్తున్న వారు అవినీతి పరులు మాత్రమే..' ఇవీ తెలుగుదేశం నేతలు చేస్తున్న కామెంట్లు. తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు ఫిరాయించిన నేపథ్యంలో వారి గురించి పచ్చ పార్టీ నుంచి ఈ కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.

ఇందు మూలంగా ఏం చెబుతున్నట్టు? తమ హయాంలో నేతలు దోచేశారు అనే కదా! ఇప్పుడు అధికారం చేజారడంతో వారి చుట్టూ కేసులు అల్లుకునే అవకాశం ఉందనే కదా? అడ్డగోలుగా సంపాదించి, ఇప్పుడు అధికారం లేకపోతే ఇరుక్కుంటారనే భయంతోనే వారు బీజేపీలోకి వెళ్లారని స్వయంగా తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు.  తద్వారా తమ దోపిడీ పాలనను వారే హైలెట్ చేస్తూ ఉన్నారు.

అందులోనూ ఫిరాయించింది ఏమీ అనామకులు కాదు. చంద్రబాబు నాయుడుకు అతిసన్నిహితులు! పార్టీకి టికానా లేని కాలంలోనే వాళ్లకు చంద్రబాబు నాయుడు రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చారు. సీఎం రమేశ్, సుజనా చౌదరిలు చంద్రబాబుకు ఎంత సన్నిహితులుగా మెలిగారో అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడే వారే ఫిరాయించారు. వారు దోచుకుని వెళ్లారు అని టీడీపీ అంటోంది.

అంటే అలాంటి దోపిడీ దారులకే చంద్రబాబు నాయుడు రాజ్యసభ్య సభ్యత్వాలు ఇస్తూ వచ్చారనమాట. దశాబ్దాలుగా వారే చంద్రబాబుకు అతి సన్నిహితులుగా మెలిగారనమాట. తమ దోపీడీ గురించి ఇంకా కళ్లు తెరవని వారు ఎవరైనా ఉంటే, వారి కళ్లు తెరిపించడానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.

పవన్ ఓటమికి మరెవరూ కారణం కాదు.. పవన్ కల్యాణే