కుప్పం ఓటర్లను బాబు ఎలా ఆకట్టుకుంటారు?

చిత్తూరు జిల్లాల్లో తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కుప్పం నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు కోట. 1983 నుంచి అది టీడీపీకి కంచు కోటగా ఉంది. 1983 , 85 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి…

చిత్తూరు జిల్లాల్లో తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కుప్పం నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు కోట. 1983 నుంచి అది టీడీపీకి కంచు కోటగా ఉంది. 1983 , 85 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున రంగస్వామి నాయుడు గెలిచినప్పటికీ 1989 నుంచి చంద్రబాబు నాయుడు అప్రహతిహతంగా గెలుస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల వరకు ఆయనకు ఎదురులేకుండా పోయింది. కానీ రాబోయే ఎన్నికలను చూసి బాబు భయపడుతున్నారు. గెలుస్తానో గెలవనో అనే భయం ఆయన్ని పట్టి పీడిస్తోంది. ఇన్నేళ్ళలో ఆయన విజయం నల్లేరు మీద నడకలా సాగింది.

కనీసం ఆయన వెళ్లి నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. స్థానిక నాయకులే దాఖలు చేసేవారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన ఆటలు సాగేలా కనిపించడం లేదు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని జగన్ శపథం చేశారు. ఆ బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. దీంతో రాజ‌కీయాలో ప‌రిస్థితులు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌లేమ‌న్న‌ట్టుగా.. ఇక్క‌డ టీడీపీ ప‌రిస్థితి డోలాయ మానంలో ప‌డిపోయింది. కుప్పంను మినీ మునిసిపాలిటీ చేయ‌డం.. అభివృద్ధి దిశ‌గా ప‌రుగులు పెట్టించ‌డం.. ఇటీవ‌లే 66 కోట్ల రూపాయ‌ల‌ను స‌ర్కారు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో .. కుప్పం వైసీపీలో జోష్ పెరిగింది.

బాబుకు భయం పట్టుకుంది. టీడీపీలోని ఓ వ‌ర్గం నాయ‌కులు కొంతకాలం కిందట పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉలిక్కి ప‌డిన త‌మ్ముళ్లు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని చంద్రబాబుకు విన్న‌వించారు. దీంతో చంద్ర‌బాబు 24 నుంచి వ‌రుస‌గా మూడు రోజుల పాటు.. కుప్పంలో ప‌ర్య‌టించేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ఏం చేస్తారు? కుప్పంపై ఎలాంటి వ్యూహాన్నిప్ర‌క‌టిస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఇన్నేళ్లు బాబు కుప్పం నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడి ఓటర్లు చచ్చినట్లు తననే గెలిపిస్తారనే ధీమా ఉండేది. 

చంద్ర‌బాబు గ‌త 40 ఏళ్ల చ‌రిత్ర‌లో సంక్రాంతి.. ద‌స‌రా వంటి పండుగ‌ల సంద‌ర్భంలోనే కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక మాత్రం.. ఆయ‌న ప‌దే ప‌దే కుప్పం బాట ప‌డుతున్నారు. బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. అంత‌టితో అయిపోగానే.. ఆయ‌న తిరిగి హైద‌రాబాద్ వెళ్లిపోతున్నారు. కానీ, ఇప్పుడు ఇక్క‌డ అంత‌కుమించి ఆయ‌న ఏదైనా చేయాల‌ని త‌మ్ముళ్లు కోరుతున్నారు. కేవ‌లం పైపై మాట‌లు కాదు.. ఏదైనా ప్ర‌ణాళిక ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మున్సిప‌ల్ ఓట‌మి త‌ర్వాత బాబులో కూడా ఆందోళ‌న అయితే ఉంద‌నే అంటున్నారు.

ఒక‌వైపు.. వైసీపీ దూకుడు చూపిస్తుంటే.. టీడీపీ మాత్రం పైపైమాట‌ల‌తో ముందుకు సాగ‌డం స‌రికాద‌ని ఇక్క‌డి నాయ‌కుల వాద‌న‌. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌పై వైసీపీ క‌న్నేసి.. త‌న‌వైపు తిప్పుకుంటున్న నేపథ్యంలో చంద్ర‌బాబు దానికి విరుగుడు మంత్రం వేయాల‌నేది.. ఇక్క‌డి నాయ‌కుల ప్ర‌ధాన సూచ‌న‌. ఈ నేప‌థ్యంలో కుప్పంలో  24 నుంచి మూడు రోజులు సాగించే ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ప్రజలకు ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది. వైసీపీ నేత‌ల‌కు వార్నింగులు ఇస్తారో.. పార్టీ నేత‌ల‌ను లైన్‌లో పెడ‌తారో చూడాలి. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు ఇటీవల తరచూ పర్యటిస్తున్నారు.

అధికార వైసీపీ తన నియోజకవర్గంపై దృష్టి పెట్టడం, స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి ఓటమి ఎదురు కావడంతో ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించక తప్పడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. అక్కడే సొంత ఇంటిని నిర్మించుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల్లో కుప్పం అభ్యర్థిగా భరత్ ను ప్రకటించారు. కుప్పం మున్సిపాలిటీకి భారీగా  నిధులను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన మూడు రోజుల పాటు సాగుతుంది.