గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై నమోదైనా కేసులపై నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం… ఉద్రిక్తతలను నివారించేందుకు రిమాండుకు పంపాలన్న ప్రాసిక్యూషన్ వాదలను కోర్టు అంగీకరించలేదు. ముందస్తు నోటిసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడాని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లాయి.
రిమాండ్ కు పంపాలన్న వాదనలను తోసిపుచ్చింది న్యాయస్థానం. ఆయన బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో సూమారు 3 గంటలపాటు వాదనలు జరిగాయి.
వివాదాస్పద వ్యాఖ్యల కారణం నమోదైన కేసుల కారణంగా ఇవాళ ఉదయం రాజా సింగ్ ను ఆరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో వాదనలు జరుగుతుండగా కోర్టు వద్ద బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఇవాళ ఉదయం రాజాసింగ్ వ్యాఖ్యలు దూమారం చేలరేగడంతో బీజేపీ అధిష్ఠానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.