రంగ రంగా..వైభవం సరిపోదు

రంగ రంగ వైభవంగా… మెగా హీరో వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. పేరుకు తగ్గట్లు కలర్ ఫుల్ గా వుంది. ఫ్యామిలీ టచ్ వుంది. యూత్..లవ్..రొమాంటిక్ జానర్ యాడ్…

రంగ రంగ వైభవంగా… మెగా హీరో వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. పేరుకు తగ్గట్లు కలర్ ఫుల్ గా వుంది. ఫ్యామిలీ టచ్ వుంది. యూత్..లవ్..రొమాంటిక్ జానర్ యాడ్ అయింది. అంతా బాగుంది కానీ ట్రయిలర్ కట్ మాత్రం నూటికి నూరు శాతం ఇంప్రెసివ్ గా చేయలేకపోయానే అనిపించింది. ఇదే కంటెంట్ తో ఇంకా మంచి ట్రయిలర్ కట్ చేయొచ్చు అనే అభిప్రాయం కలిగించేలా వుంది.

సినిమా కంటెంట్ మీద డౌట్ లేదు. రెండు కుటుంబాలు, స్నేహ బంధాలు, చిన్న చిన్న ఇగో సమస్యలు అన్నీ కలిసి నిన్నే పెళ్లాడుతా, డార్లింగ్ సినిమాల సబ్జెక్ట్ లను గుర్తుకు తెస్తున్నాయి. 

సో కంటెంట్ పరంగా ఓకె. కానీ ట్రయిలర్ కట్ లో మరి కాస్త జాగ్రత్తలు తీసుకుని వుంటే మరింత బాగుండేది. ట్రయిలర్ లో హీరోయిన్ అన్న..’సరిపోలేదుగా’ డైలాగు ట్రయిలర్ కు యాప్ట్ గా సరిపోతుంది.

స్టార్ కాస్ట్, కలర్ ఫుల్ చిత్రీకరణ అంతా బాగానే వుంది, సినిమాలో హీరో, హీరోయిన్లు, మిగిలిన నటుల స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే వుంది. కానీ ట్రయిలర్ కు సరిపడే సన్నివేశాల ఎంపిక, వాటి ఆర్డర్ ఇలాంటి వాటి విషయంలో మరి కాస్త శ్రద్ద తీసుకోవాల్సి వుంది. 

ఎందుకంటే ఇవ్వాళా, రేపు ఆడియన్స్ కు నార్మల్ కంటెంట్ సరిపోవడం లేదు. బహుశా విడుదలకు ముందు మరో ట్రయిలర్ ఎలాగూ అందించే అవకాశం వుంది.