‘మా’ బిల్డింగ్ మేమే కడతాం-మంచు విష్ణు

తెలుగు నటీనటుల సంఘానికి చిరకాలంగా వున్న భవన సమస్య పరిష్కారం అయిపోయినట్లే. భవనం ఖర్చు మొత్తాన్ని తమ కుటుంబమే భరిస్తుందని హీరో మంచు విష్ణు ప్రకటించారు.  Advertisement భవన నిర్మాణ వ్యయంలో పాతిక శాతం…

తెలుగు నటీనటుల సంఘానికి చిరకాలంగా వున్న భవన సమస్య పరిష్కారం అయిపోయినట్లే. భవనం ఖర్చు మొత్తాన్ని తమ కుటుంబమే భరిస్తుందని హీరో మంచు విష్ణు ప్రకటించారు. 

భవన నిర్మాణ వ్యయంలో పాతిక శాతం భరిస్తానని గతంలో మాట ఇచ్చామని, అయితే ఇప్పుడు మొత్తం ఖర్చు తామే భరిస్తామని ఆయన ఓ వీడీయో ప్రకటనలో స్పష్టం చేసారు. 

ఇక భవన సమస్య పరిష్కారం అయిపోయినట్లే కనుక, సంఘ సభ్యుల సమస్యలపై దృష్టి పెడదామని, అన్ని యూనియన్లలో సభ్యులు కాని వారికి టాలీవుడ్ లో పని చేసే అవకాశం వుండదని, కానీ నటీనటుల సంఘంలో మాత్రం అలా లేదని ఆయన అన్నారు. 

ఇకపై తెలుగులో నటించే అందరికీ మా సభ్యత్వం వుండేలా చూసి, ఆ జాబితాను నిర్మాతలకు అందరికీ అందచేసి, సభ్యులందరికీ పనిదొరికేలా చేయాల్సి వుందన్నారు.

తెలుగు సినిమా పెద్దలు కృష్ణ, కృష్ణం రాజు, సత్యనారాయణ, చిరంజీవి, తన తండ్రి మోహన్ బాబు తో సహా అందరూ కలిసి కూర్చుని డిస్కస్ చేసి ఏకగ్రీవంగా ఓ అధ్యక్షుడిని ఫిక్స్ చేస్తే మంచిదే అని, అప్పుడు తను పోటీ చేయనని, లేదూ అంటే తను పోటీ చేయకతప్పదని విష్ణు స్పష్టం చేసారు.