వెంకయ్య ఇకపై కూడా నీతులు చెబుతారా?

గత కొంత కాలంలో ఫిరాయింపు రాజకీయాల గురించి చాలా కామెంట్లే చేశారు వెంకయ్య నాయుడు. ప్రత్యేకించి ఉప రాష్ట్రపతి హోదాకు వెళ్లిన తర్వాత అనేక సార్లు ఫిరాయింపు రాజకీయాలను ఆయన తప్పు పట్టారు. ప్రత్యేకించి…

గత కొంత కాలంలో ఫిరాయింపు రాజకీయాల గురించి చాలా కామెంట్లే చేశారు వెంకయ్య నాయుడు. ప్రత్యేకించి ఉప రాష్ట్రపతి హోదాకు వెళ్లిన తర్వాత అనేక సార్లు ఫిరాయింపు రాజకీయాలను ఆయన తప్పు పట్టారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు కూడా ఫిరాయింపు రాజకీయాల పట్ల అసహ్యభావం ఉన్నట్టుగా ఆయన మాట్లాడారు.

తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావులు పోటీలుపడి రాజకీయ ఫిరాయింపులను చేయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వెంకయ్య నాయుడు ఘాటుగా స్పందిస్తూ వచ్చారు. ఇక రాజ్యసభ చైర్మన్ గా పార్టీ నియామవళిని వ్యతిరేకించిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై అనర్హత వేటు వేసిన నేపథ్యం కూడా ఉంది వెంకయ్యకు.

అయితే ఇప్పుడు వెంకయ్య నిర్ణయం వివాదాస్పదంగా మారింది. మెజారిటీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు నిర్ణయాలు తీసుకున్నా ఏ విలీనం కూడా చెల్లదని కోర్టు తీర్పులు చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ విభాగం బీజేపీలోకి విలీనం కూడా చెల్లదు అని గత కోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. విలీనం జరగడం అంటే అది ఎన్నికల సంఘం ద్వారా జరగాలి తప్ప.. చట్టసభల ద్వారా జరిగేది కాదని తేటతెల్లం అవుతోంది.

అయితే ఇన్నాళ్లూ ఫిరాయింపుల మీద నీతులు చెప్పిన వెంకయ్య నాయుడు తాజా ఫిరాయింపులకు మాత్రం తనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న స్థానంలో ఉన్నారు. ఫిరాయించగానే వేటుపడాలన్న ఆయన ఇప్పుడు నలుగురు ఫిరాయింపుదారులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న స్థానంలో ఉన్నారు. మరి ఇక నుంచి ఫిరాయింపుల విషయంలో ఈయన ఏం చెబుతారు? ఇంతకు ముందులానే నీతులు చెబుతారా? అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

బాబుగారూ.. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'