Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వరల్డ్ కప్ కోసం వెనక్కి..

వరల్డ్ కప్ కోసం వెనక్కి..

క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాధ్ లేటెస్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాకు విడుదల డేట్ జూలై 12 అంటూ ప్రకటించారు. వాస్తవానికి అంతకన్నా ముందు ఓ డేట్ అనుకున్నారు కానీ, వర్క్ ఫినిష్ కాక జూన్ 12కు ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు మరోవారం వెనుక్కు వెళ్లబోతోంది. దీనికి మరేమీ కారణం కాదు. క్రికెట్ వరల్డ్ కప్ కీలక మ్యాచ్ లు వుండడమే.

క్రికెట్ ఫైనల్ లోకి ఇండియా ఎంటర్ అయితే పరిస్థితి వైరల్ గా వుంటుంది. జనాలు టీవీలకు అంటిపెట్టుకు వుండిపోతారు. అందుకే వన్ వీక్ వెనక్కు వెళ్తే బెటర్ అని డిసైడ్ అయిందట నిర్మాత చార్మీ టీమ్. ఆ మేరకు నిర్ణయం తీసుకుని జూలై 18 గురువారం డేట్ గా డిసైడ్ అయ్యారట.

కానీ సమస్య ఒకటే, ఆ తరువాత వారం డియర్ కామ్రేడ్ వస్తోంది. సినిమా ఎలా వుంటుంది అన్నది అలావుంచితే, విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా వుండదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలా వున్నా కూడా విజయ్ దేవరకొండ సినిమా వచ్చిన తరువాత సైడ్ ఇవ్వక తప్పదు. కలెక్షన్ల మీద బాగా ప్రభావం చూపిస్తుంది.

ఇక్కడ వరల్డ్ కప్ మ్యాచ్ అన్న ఒక్క రోజును మినహాయిస్తే, సినిమా ఏమాత్రం బాగున్నా 15 రోజులు సోలోగా దున్నేసుకోవచ్చు. కానీ హీరో రామ్ మాత్రం వన్ వీక్ అయినా ఓకె వెనక్కే వెళ్దాం అని చెప్పేసాడట.

బాబుగారూ.. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?