పవన్ తానా పయనం వెనుక..?

అమెరికా తెలుగు సంఘ 'తానా' సభలకు జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఇది కాస్త ఆశ్చర్యం కలిగించింది పొలిటికల్ ఇన్నర్ సర్కిళ్లలో. ఎందుకుంటే తానా అనగానే ఓ పర్టిక్యులర్ సామాజిక వర్గానికి…

అమెరికా తెలుగు సంఘ 'తానా' సభలకు జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఇది కాస్త ఆశ్చర్యం కలిగించింది పొలిటికల్ ఇన్నర్ సర్కిళ్లలో. ఎందుకుంటే తానా అనగానే ఓ పర్టిక్యులర్ సామాజిక వర్గానికి చెందినది, దాని ప్రముఖులే కీలకంగా వుంటారు అన్న అభిప్రాయం బలంగా వుంది. చంద్రబాబు నాయుడు గెలిచి సిఎమ్ అయి వుంటే ఆయనే చీఫ్ గెస్ట్ గా వుండేవారేమో అన్న టాక్ కూడా వుంది.

అలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెళ్లడంపై పొలిటికల్ ఇన్నర్ సర్కిళ్లలో కాస్త ఆశ్చర్యం కలిగించడం సహజం. అయితే చంద్రబాబు లేక, జగన్ వచ్చే పరిస్థితి లేక, సరైన అతిధి లేకపోతే తానా సభలు వెలవెలబోయే ప్రమాదం వుంది. టికెట్ లు తెగడం కూడా కష్టం అవుతుంది.

అందుకే పవన్ కళ్యాణ్ ను ఒప్పించి, రప్పిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ను ఒప్పించి, రప్పించే బాధ్యతను తెలుగునాట ఓ మీడియా ఛానెల్ అధిపతికి అప్పగించినట్లు, ఆయనే దగ్గర వుండి పవన్ ను తోడ్కోని తీసుకువెళ్తారని కూడా వినిపిస్తోంది. పవన్ కు ఆ మీడియా ఛానెల్ అధిపతికి చిరకాలంగా మంచి సంబంధాలే వున్నాయి. అప్పట్లో పవన్ కు ఓ ఖరీదైన కారు కూడా బహుబతిగా ఇచ్చారని వార్తలు వచ్చాయి.

గడచిన ఎన్నికల్లో ఆ ఛానెల్ జగన్ కు కాస్త దూరమైంది. ఇప్పుడు జగన్ కు దగ్గర కావాలన్నా, దూరంగానే వుంచుతున్నారని గుసగుసలు వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పవన్ తో సాన్నిహిత్యం మాత్రం గట్టిగా వుంచుకున్నారని, తానా పెద్దల కోరిక మేరకు ఆయనే పవన్ ను ఒప్పించడమే కాకుండా, స్వయంగా తోడ్కొని వెళ్తారని, పనిలో పనిగా ఆయనకు కూడా కాస్త గట్టి సన్మానం వుంటుందని టాక్ వినిపిస్తోంది.

బాబుగారూ.. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'