టాలీవుడ్ జనాలు ఇఫ్పుడు ఎదురు చూస్తున్నది ఆర్ఆర్ఆర్ నో మరో సినిమానో విడుదల కోసం కాదు. ఆంధ్ర సిఎమ్ జగన్ అపాయింట్ మెంట్ కోసం.
మెగాస్టార్ తో సహా ఇండస్ట్రీ జనాలు ఎవరెవరో అపాయింట్ మెంట్ అడిగారని పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఎవ్వరికీ ఇంకా ఏ సమాధానం, క్లారిటీ రాలేదు. రేపు తెలుస్తుంది..రేపు తెలుస్తుంది అని ఇండస్ట్రీ జనాలు ఎవరికి వారు చెప్పుకోవడం తప్పించి మరే క్లారిటీ లేదు.
మరోపక్కన ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో ఆంక్షలు ఇంకా సడలిపోలేదు. ఈస్ట్ లో ఇంకా నాలుగు వందలకు పైగా కేసులు నిత్యం వస్తున్నాయి. అందువల్ల అక్కడ సడలింపులు వుంటాయా? అన్నది క్లారిటీ లేదు.
ఆ క్లారిటీ వచ్చాకే సినిమాల విడుదల డేట్లు పక్కా అవుతాయి. ఇప్పటికి ఎవరికి వాళ్లు డేట్ లు ఫిక్స్ చేసుకుని కూర్చున్నారు తప్ప ఆ డేట్ కు సినిమాలు వస్తాయన్న గ్యారంటీ అయితే లేదు. సిఎమ్ జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే తప్ప క్లారిటీ రాదు.
నెలాఖరు నుంచి తిమ్మరసు, ఇష్క్, టక్ జగదీష్, లవ్ స్టోరీ, ఇలా వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకన్నారు కానీ ఒక్క తిమ్మరసు మినహా మరెవరు అధికారికంగా డేట్ లు ప్రకటించలేదు. అంతా జగన్ అపాయింట్ మీద ఆధారపడి వుంది.