ప్రభుత్వ అవార్డులకు సిఫార్సులు కావాలి. ప్రయివేట్ అవార్డులకు ఫండ్స్ వుంటే చాలు. మన సినిమా జనాలకు చాలా మందికి విదేశీ డాక్టరేట్లు ఇలా వచ్చినవి కూడా వున్నాయి.
తమకు డాక్టరేట్ వచ్చిందోచ్ అని డప్పు కొట్టుకోవచ్చు. ఈ మద్య ఇలాంటి ప్రయివేట్ అవార్డులు చాలా వచ్చేస్తున్నాయి. ఆఖరికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు కూడా డూప్లికేట్ వచ్చేసింది.
నిన్నటికి నిన్న ఈ డూప్లికేట్ అవార్డు లాంటి అవార్డు హీరో సుమన్ కు ఇచ్చేసారు.దాంతో సుమన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటూ మీడియా జనాలు రాసేసారు.
సోషల్ మీడియా జనాలు ఫార్వార్ట్ లు కొట్టేసారు. అచ్చంగా మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చిన టికెట్ ల జీవోను తమ చిత్తానికి అన్వయించి రాసేసుకున్నట్లే.
నిర్మాత, హీరో, స్టూడియో అధినేత, దర్శకుడు ఇలా ఇన్ని క్వాలిటీస్ వున్న హీరో కృష్ణ వుండగా సుమన్ కు ఎలా ఇస్తారన్న ఆలోచన వచ్చినా, కాస్త నిశితంగా పరిశీలించి వుండేవారు.
ఎవరో కృష్ణ చౌహాన్ ఫౌండేషన్ వాళ్లంట, దాదాసాహెబ్ ఫాల్కే పేరిట అవార్డు పంచేస్తున్నారు. అదే సుమన్ కు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చేది కాదు. అయినా ఈ సినిమా జనాలు కూడా ఏమిటో? ఎవరు అవార్డు ఇస్తే అది తీసేసుకోవడమే. దానికి ఓ క్రెడిబులిటీ వుందో లేదో చూసుకోవాలిగా?