బాలీవుడ్ కు సూర్య సూపర్ హిట్ మూవీ

సౌత్ నుంచి మరో సినిమా బాలీవుడ్ బాట పట్టింది. ఈసారి సూర్య వంతు. అతడు నటించిన ఆకాశం నీ హద్దురా (తమిళ్ లో సురారై పొట్రు) మూవీ ఇప్పుడు హిందీలో రీమేక్ అవ్వబోతోంది. ఈ…

సౌత్ నుంచి మరో సినిమా బాలీవుడ్ బాట పట్టింది. ఈసారి సూర్య వంతు. అతడు నటించిన ఆకాశం నీ హద్దురా (తమిళ్ లో సురారై పొట్రు) మూవీ ఇప్పుడు హిందీలో రీమేక్ అవ్వబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

నిర్మాత విక్రమ్ మల్హోత్రాతో కలిసి సూర్య స్వయంగా ఈ రీమేక్ ను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. తమిళ్ లో ఈ సినిమాను డైరక్ట్ చేసిన సుధా కొంగర, హిందీ రీమేక్ ను కూడా డైరక్ట్ చేయబోతున్నారు. 

ప్రాజెక్ట్ ను తాజాగా ప్రకటించినప్పటికీ.. ఈ రీమేక్ లో హీరో కోసం కొన్ని రోజులుగా వెదుకుతూనే ఉన్నారు మేకర్స్. ఇందులో భాగంగా అజయ్ దేవగన్ తో ఈ సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

మరోవైపు తన సినిమా హిందీలో రీమేక్ అవ్వడంపై సూర్య హ్యాపీ ఫీలయ్యాడు. కరోనా వల్ల పరిస్థితులు అనుకూలించక, తన సినిమా ఓటీటీలో నేరుగా రిలీజైందని.. హిందీ రీమేక్ మాత్రం థియేటర్లలో రిలీజ్ అవుతుందని చెబుతున్నాడు. ఈ సినిమాను తను అంగీకరించినప్పుడే దీనికి పాన్ ఇండియా అప్పీల్ ఉందనే విషయాన్ని గ్రహించానని, ఇప్పుడు హిందీ రీమేక్ డీల్ తో తన నమ్మకం నిజమైందని అంటున్నాడు.

సామాన్యుడికి కూడా విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ జీఆర్ గోపీనాధ్ ఆశయాలు, ఆయన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఆకాశం నీ హద్దురా సినిమా తెరకెక్కింది.