విశాఖలో విస్పోటనం ..

విశాఖ ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరం. అటు హైదరాబాద్ కి ధీటుగా చెప్పుకునే సిటీ కూడా ఇదే. విశాఖ ఆర్ధికంగా, రాజకీయంగా కూడా ముందున్న సిటీ. Advertisement ఇక విశాఖ…

విశాఖ ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరం. అటు హైదరాబాద్ కి ధీటుగా చెప్పుకునే సిటీ కూడా ఇదే. విశాఖ ఆర్ధికంగా, రాజకీయంగా కూడా ముందున్న సిటీ.

ఇక విశాఖ పేరు తెలియని వారు ఎవరూ ఉండరని అంటారు. ఇదిలా ఉంటే ఈ మెగా సిటీ మీద భారీ వత్తిడి పడబోతోంది. అదెలా అంటే జనాభా పెరుగుదల అని అంటున్నారు. గత పదేళ్లలో సిటీ మీద అధిక భారం పడుతోంది. 2011 నుంచి నేటి వరకూ చూసుకుంటే విశాఖ సిటీలో 2.34 శాతం పైగా జనాభా వృద్ధి రేటు కనిపించింది.

తాజాగా జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే విశాఖ 22 లక్షల 27 వేలకు చేరుకుంది. మరో పదేళ్లలో విశాఖ ముప్పయి లక్షల పై చిలుకు జనాభాతో కిటకిటలాడుతుందని కూడా జనాభా గణన విశ్లేషణలు వెల్లడిస్తున్నారు. ఇక 2050 నాటికి విశాఖ అర కోటి జనాభాను దాటేస్తుంది అని కూడా అంటున్నారు.

మొత్తం మీద చూసుకుంటే విశాఖలో ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటోందన్న అంచనాలు ఉన్నాయి. త్వరలో పరిపాలనా రాజధాని కనుక వస్తే ఈ అంచనాలు ఇంకా తొందరగా నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఎదుగుతున్న పెరుగుతున్న నగరంగా విశాఖ ఇపుడు ఆసియా ఖండంలోనే ముందు వరసలో ఉందని చెబుతున్నారు. 

విశాఖ జనాభా వివరాల‌ను అందించిన ఏయూ జనాభా గణన విభాగం అధికారులు కూడా ఈ సిటీలో అంతకంతకు జనాభా పెరుగుతోందని నిర్ధారించారు. దానికి తగినట్లుగా మౌలిక సదుపాయాల కల్పన జరగకపోతే మాత్రం ఘనమైన విశాఖ కీర్తికి మరకలు అంటడం ఖాయం.