సినిమా హీరోలకు డ్రీమ్ క్యారెక్టర్ అనేది కామన్ గా ఒకటి వుంది. అదే పోలీస్ క్యారెక్టర్. దాదాపు ప్రతి హీరో తన కెరీర్ లో ఓసారి అయినా పోలీస్ క్యారెక్టర్ ట్రయ్ చేస్తూ వుంటారు.
హీరో రామ్ కేవలం పోలీస్ క్యారెక్టర్ తో ఆగకుండా, డాక్టర్ క్యారెక్టర్ కూడా చేసేస్తున్నాడని తెలుస్తోంది. లింగుస్వామి డైరక్షన్ లో చిట్టూరి శ్రీను నిర్మిస్తున్న సినిమాలో హీరో రామ్ క్యారెక్టర్ కు రెండు షేడ్ లు వుంటాయని తెలుస్తోంది.
ఇందులో ఒకటి డాక్టర్..రెండోది పోలీస్. డాక్టర్ రోగులకు వైద్యం చేస్తే, పోలీస్ సమాజానికి పట్టిన చీడలను సరిచేస్తాడు. అందుకే హీరో ఈ రెండు షెడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత ఫుల్ యాక్షన్ సినిమా చేయాలని డిసైడై ఈ పోలీస్ గా మారిన డాక్టర్ సినిమా చేస్తున్నాడు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్లతో నడిచే పక్కా లింగుస్వామి స్టయిల్ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్.