రాజుగారి సర్వేలో జనసేన గల్లంతు

రఘురామ కృష్ణం రాజు ఇప్పుడు ఫుల్ బిజీ. నిత్యం యాంటీ వైకాపా న్యూస్ లను క్రియేట్ చేయడంలో ఆయన ఫుల్ బిజీ. అంతకన్నా ఘనమైన పనేమీ లేదు ఆయనకు. ఇందులో భాగంగా తన స్వంత…

రఘురామ కృష్ణం రాజు ఇప్పుడు ఫుల్ బిజీ. నిత్యం యాంటీ వైకాపా న్యూస్ లను క్రియేట్ చేయడంలో ఆయన ఫుల్ బిజీ. అంతకన్నా ఘనమైన పనేమీ లేదు ఆయనకు. ఇందులో భాగంగా తన స్వంత సర్వే అంటూ ఒకటి బయటకు వదిలారు. ఆంధ్ర లోని మొత్తం నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయన్నది ఆయన సర్వే చేయించారట. వాటిని వదిలారు.

నిజానికి ఆ సర్వే చూస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు. జనాల్లోకి వెళ్లక్కరలేదు ప్రచారం చేయనక్కరలేదు. సూపర్ మెజారిటీతో అధికారం ఆయనను వరించడానికి సిద్దంగా వుంటే ఇంక ఎందుకు కష్టపడడం. అలాగే మరో పని కూడా చేయొచ్చు. భాజపా పంచన చేరడానికి నానా బాధ పడనక్కరలేదు. జనసేన ను తమ వైపు తిప్పుకోవడానికి అస్సలు ప్రయాస అవసరం లేదు.

ఎందుకంటే సోలోగానే తెలుగుదేశం వెలిగిపోతోందరి రఘురామరాజు తేల్చేసారు కదా. ఇంకెందకు పాకులాట. భాజపాకు రెండో మూడో సీట్లు, జనసేనకు పదో పదిహేనో సీట్లు విదలించాల్సిన అవసరం కూడా లేదు. పైగా రాజగారి సర్వేలో మరో గమ్మత్తు వుంది. 

ఆయన కేవలం వైకాపా-తేదేపా ఓట్ల శాతం సర్వే ఫలితాలు మాత్రమే వెల్లడించారు. వాటిని కలిపి, శతశాతం లోంచి మైనస్ చేస్తే మిగిలే శాతమే భాజపా, కాంగ్రెస్, జనసేన, కామ్రేడ్స్ అండ్ అదర్స్ అన్నమాట. కానీ పాపం కొన్ని చోట్ల ఆ మిగిలే శాతం చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. 

కొన్ని చోట్ల ఆ శాతం ఎక్కువగానే వుంది కానీ అది ఎవరి ఖాతాలోకి అన్నది చెప్పనేలేదు. అంటే జనసేన అనే పార్టీ కానీ, దానికి వచ్చే ఓట్ల శాతం కానీ సదరు రాజుగారికి ఆనలేదు లేదా అవసరం లేదు అన్నమాటేగా.

లేస్తే మనిషిని కాదు, వైకాపాను దించడమే ధ్యేయం అని తెగ హడావుడి చేస్తున్న పవన్ కళ్యాణ్ జనసేనకు ఒక్క చోట కూడా మెజారిటీ లేకపోవడం ఏమిటి? పెద్దాపురం, పిఠాపురం, అమలాపురం లాంటి కాపు ఓట్ల శాతం అధికంగా వుండే అనేక చోట్ల తేదేపాకే లీడ్ వుందని రాజుగారు డిసైడ్ చేసారు. ఇంక జనసేన ఏం కావాలి? ఏం చేయాలి? ఇంక తేదేపాకు ఆ పార్టీతో పొత్తు, కొన్ని సీట్లు త్యాగం చేయడం అవసరమా?

మొత్తానికి రాజుగారు తన సర్వేతో పొలిటికల్ జనాలను బాగానే ఎంటర్ టైన్ చేసారనే చెప్పుకోవాలి. నవ్వుకోవడానికి అంతకన్నా మంచి స్టఫ్ వుండదు కదా?