అబ్బే.. కోవర్టు ఆపరేషన్ కాదట!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు  నాయుడుకు ఇలాంటి కోవర్టు ఆపరేషన్లు నిర్వహించడం కొత్త ఏమీ కాదు అని అంటున్నారు పరిశీలకులు. తన అవసరార్థం ఇతర పార్టీల్లోకి తనకు బాగా సన్నిహితులు అయిన నేతలను పంపడం, అక్కడ…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు  నాయుడుకు ఇలాంటి కోవర్టు ఆపరేషన్లు నిర్వహించడం కొత్త ఏమీ కాదు అని అంటున్నారు పరిశీలకులు. తన అవసరార్థం ఇతర పార్టీల్లోకి తనకు బాగా సన్నిహితులు అయిన నేతలను పంపడం, అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడం, సమయం వచ్చినప్పుడు అలాంటి నేతలు ఆ పార్టీ  నుంచి బయటకు రావడం.. రచ్చలు చేయడం.. ఇవన్నీ చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయాలు అని చాలా మంది చెబుతూ ఉంటారు.

గతంలో ఇలాంటి ఉదాహరణలున్నాయి. చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో ఇలాంటి కుటిల వ్యూహాలు ఇది వరకూ కూడా బయటపడ్డాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఎంపీలు నలుగురు బీజేపీలోకి చేరడం కూడా అలాంటి కోవర్టు ఆపరేషనే అని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు తన అవసరార్థం నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపారు.. ఈ వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబు నాయుడే అనే అభిప్రాయాలు  వినిపిస్తున్నాయి.

ఈ కోవర్టు  ఆపరరేషన్ విషయంపై చర్చ  జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో టీడీపీపై సానుభూతి రాకపోగా..  ఇదంతా చంద్రబాబు నాయుడి ప్లానే అనే ప్రచారం గట్టిగా సాగుతూ ఉంది. దీంతో తెలుగుదేశం  పార్టీ ఈ అంశంలో కూడా డిఫెన్స్ లో పడినట్టుగా  ఉంది.

తామే ఎంపీలను బీజేపీలోకి పంపినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ ఖండిస్తోంది. ఇది కోవర్టు  ఆపరేషన్ కాదని ఆ పార్టీ  నేతలు వివరణ ఇచ్చుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ నుంచి నేతలు ఫిరాయించి వెళ్లినా, అనుమానాలన్నీ చంద్రబాబునాయుడు మీదే కలుగుతూ ఉండటం.. ఆయన నలభై యేళ్ల రాజకీయ ఇమేజ్ ను చాటి చెబుతున్నట్టుగా ఉందని విశ్లేషకులు అంటున్నారు!