నలుగురు వెళ్లారు.. ఇంకా ఎవరు?

తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్లిపోయారు. ఇక మిగిలింది ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రమే. ఏదో తెలుగుదేశం ఉనికి కోసం ఇద్దరు నిలిపి, నలుగురు వెళ్లడానికి చంద్రబాబు నాయుడే గ్రీన్ సిగ్నల్…

తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్లిపోయారు. ఇక మిగిలింది ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రమే. ఏదో తెలుగుదేశం ఉనికి కోసం ఇద్దరు నిలిపి, నలుగురు వెళ్లడానికి చంద్రబాబు నాయుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

వారంతా చంద్రబాబు నాయుడి ప్రయోజనాల కోసమే వెళ్లి ఉండవచ్చుగాక. మరికొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూడా వెళ్తారు అనే టాక్ మాత్రం కొనసాగుతూ ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరబోతూ ఉన్నారనే మాట వినిపిస్తూ ఉంది.

ఈ జాబితాలో రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అక్కడి మాజీ ఎంపీలు చలో బీజేపీ అంటున్నారట. అయితే వారికి ఇంకా డీల్స్ కుదరడం లేదని తెలుస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్, తెలుగుదేశం మార్కు రాజకీయాలకు వారు అలవాటు పడ్డారు.

ప్రతిదానికీ ఒక రేటు కట్టి రాజకీయం చేశారు. అయితే ఇప్పుడు కమలం పార్టీలోకి అలా ఎంట్రీ ఇచ్చేసి కీలక స్థానాలను సొంతం చేసుకోవాలని వారు స్కెచ్ లు వేసినట్టుగా భోగట్టా. అయితే బీజేపీలో ప్రజాబలం లేకపోయినా ఫర్వాలేదు కానీ, సీనియారిటీకే పదవులు దక్కుతూ ఉంటాయి. దీంతో కొంతమంది మాజీ ఎంపీల బీజేపీ చేరిక లేట్ అవుతోందని సమాచారం!

టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!