విశాఖలో డీజీపీ… మ్యాటరేంటి… ?

ఏపీకి పరిపాలనా రాజధానిగా విశాఖను చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు చట్టాన్ని కూడా చేసింది. అదిపుడు న్యాయ పరిశీలనలో ఉంది. మరో వైపు చూస్తే విశాఖకు రాజధాని ఎప్పటికైనా రావడం తధ్యమని…

ఏపీకి పరిపాలనా రాజధానిగా విశాఖను చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు చట్టాన్ని కూడా చేసింది. అదిపుడు న్యాయ పరిశీలనలో ఉంది. మరో వైపు చూస్తే విశాఖకు రాజధాని ఎప్పటికైనా రావడం తధ్యమని వైసీపీ నేతలు తరచుగా గట్టిగానే ప్రకటనలు చేస్తున్నారు.

అన్నింటికంటే ముందు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ విశాఖకు తరలివస్తుందని కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలో విశాఖలో సడెన్ గా డీజీప్ గౌతం సవాంగ్ రావడం రెండు రోజుల పాటు విశాఖలోనే మకాం చేయడం అన్నది ఆసక్తిని కలిగించే అంశంగా చెప్పుకోవాలి.

భీమిలీలోని గ్రేహౌండ్స్ కి వెళ్ళి అక్కడ అన్నీ పరిశీలించిన డీజీపీ సిటీలో కూడా అధికారులతో సమావేశం అయ్యారు. మరి డీజీపీ రాక వెనక ఏదైనా ఉద్దేశ్యం ఉందా అన్న చర్చ కూడా ఉందిక్కడ. 

ఆయన వచ్చారు అంటే రాజధానికి సంబంధించిన కదలిక ఏదో ఉందనే అంటున్నారు. దానికంటే ముందు సీఎం క్యాంప్ ఆఫీస్ పరిశీలన కోసం కూడా వచ్చారు అన్న మాట వినిపిస్తోంది. 

మొత్తానికి ఇవన్నీ చూస్తే మంచి ముహూర్తం చూసి సీఎం ఆఫీస్ విశాఖకు షిఫ్ట్ చేసే పనికి దిగిపోతున్నారు అన్న టాక్ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.