ఆర్ఆర్ఆర్ ప్రచారానికి ముహూర్తం ఫిక్స్

ఇప్పటివరకు సినిమాపై చేసిన ప్రచారం ఒకెత్తు. ఇకపై చేయబోయే ప్రచారం మరో ఎత్తు. అవును.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రచారపర్వం మొదలైంది. దీనికి ఈనెల 15వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ రోజున ఆర్ఆర్ఆర్…

ఇప్పటివరకు సినిమాపై చేసిన ప్రచారం ఒకెత్తు. ఇకపై చేయబోయే ప్రచారం మరో ఎత్తు. అవును.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రచారపర్వం మొదలైంది. దీనికి ఈనెల 15వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ రోజున ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు. ఇక అప్పట్నుంచి మూవీ ప్రమోషన్ ను అప్రతిహతంగా కొనసాగించబోతున్నారు.

సినిమా మేకింగ్ లోనే కాదు, ప్రమోషన్ లో కూడా రాజమౌళి తనదైన ప్రత్యేకత చూపిస్తుంటాడు. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలకు జక్కన్న ప్రచార ఎత్తుగడలు మనం చూశాం. మరీ ముఖ్యంగా పార్ట్-2 కోసం “వై కట్టప్ప కిల్డ్ బాహుబలి” అనే స్లోగన్ ను రాజమౌళి ఎంత పాపులర్ చేశాడో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాల్ని స్టార్ట్ చేయబోతున్నాడు రాజమౌళి.

నిజానికి ఈ సినిమాకు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసినప్పట్నుంచే ప్రమోషన్ మొదలైంది. రామరాజు ఫర్ భీమ్, భీమ్ ఫర్ రామరాజు అంటూ విడుదల చేసిన ఇంట్రో టీజర్లు యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయి. అయితే అధికారిక ప్రచారం మాత్రం 15వ తేదీ నుంచే మొదలు కాబోతోంది.

సినిమాకు సంబంధించి టాకీ మొత్తం పూర్తవ్వడంతో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఓ కొలిక్కి రావడంతో విడుదల తేదీపై ఓ క్లారిటీకి వచ్చాడు రాజమౌళి. అందుకే ప్రమోషన్ స్టార్ట్ చేయాలని నిర్ణయించాడు. 

ఇద్దరు పెద్ద హీరోలు నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్ని నిరాశపరచకుండా చాలా పక్కాగా ప్రమోషన్ ను ప్లాన్ చేసింది యూనిట్. దసరా కానుకగాా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.