తప్పిపోయిన ప్రేయసి-రిపబ్లిక్

రిపబ్లిక్ అని టైటిల్ పెట్టి, బ్యూరోక్రసీ..రాజకీయాల నేపథ్యంలో సినిమా తీస్తూ హీరోయిజం ఎలివేట్ చేసే సాంగ్ తీయడం అంటే తమాషా కాదు. కాలేజీ కుర్రాళ్లు దేశభక్తి గీతం ఆలపిస్తే జనం చూడరు. పొలిటికల్ బ్యాక్…

రిపబ్లిక్ అని టైటిల్ పెట్టి, బ్యూరోక్రసీ..రాజకీయాల నేపథ్యంలో సినిమా తీస్తూ హీరోయిజం ఎలివేట్ చేసే సాంగ్ తీయడం అంటే తమాషా కాదు. కాలేజీ కుర్రాళ్లు దేశభక్తి గీతం ఆలపిస్తే జనం చూడరు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ప్రస్థానం లాంటి మాంచి సినిమా తీసిన దర్శకుడు దేవా కట్టాకు ఇది తెలియకపోలేదు. అందుకే ఓ డిఫరెంట్ సాంగ్ రాయించి, హీరో సాయి తేజ్ తో చేస్తున్న రిపబ్లిక్ సినిమాలో పెట్టేసారు. 

రచయిత రెహమాన్ దర్శకుడు దేవా కట్టా ఐడియాలజీతో మ్యాచ్ అయ్యే పాట రాయడానికి కాస్త గట్టిగానే కృషి చేసినట్లు కనిపిస్తోంది.

స్వేచ్ఛను వర్ణిస్తూ..'' అని అందమైన కన్నెరా..లక్ష అక్షరాలు రాయలేని కవితరా..ఈ ప్రపంచమే కోరుకునే అతివరా….' అని ఆగకుండా ..''పెను విప్లవాల విశ్వకన్య..స్వేచ్ఛరా..అని భలే పద ప్రయోగం చేసారు రచయిత రెహమాన్. ఇదే కాదు. పల్లవిలో వదిలిన ప్రతి లైన్ బాగుంది. 

కానీ పల్లవికి దీటుగా మొదటి చరణం మాత్రం లేదు. అది కాస్త తేలిపోయింది. అక్కడ పెద్దగా పద ప్రయోగాలు కొత్తగా చేయలేదు. రెండో చరణం మొదటి చరణం కన్నా కాస్త బెటర్. ''..చల్లారని స్వాతంత్ర్య కాంక్ష స్వేచ్ఛరా..నరనరాల్లో ప్రవహించే ఆర్తిరా..'' కాస్త ప్రయత్నం చేసారు. 

ఈ రోజుల్లో మ్యూజిక్ డైరక్టర్లు అంతా ట్యూన్ కట్టి పాట రాయించుకోవడానికి అలవాటు పడిపోయారు. అలాంటిది రెహమాన్ రాసిన పాటకు మణిశర్మ ట్యూన్ కట్టాల్సి వచ్చింది. ఫోక్ టచ్ ఇస్తూ చేసిన ట్యూన్ ఒకె అనిపించుకుంటుంది. ఈ పాట కోసం సాయితేజ్ కొత్తగా ట్రయ్ చేసినట్లుంది. డ్యాన్స్ మూవ్ మెంట్స్ బాగున్నాయి. వినగా వినగా పాట పట్టుకునేలాగే వుంది.