Advertisement

Advertisement


Home > Movies - Press Releases

సాయితేజ్ కు సూపర్ సక్సెస్ రావాలి

సాయితేజ్ కు సూపర్ సక్సెస్ రావాలి

సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ `రిప‌బ్లిక్‌`. ఈ సినిమాలోని 'గానా ఆఫ్‌ రిపబ్లిక్‌' సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. 'రిపబ్లిక్‌' సినిమాలో కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాంగే పాటను ముఖ్య అతిథిగా హాజరైన స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్‌ దేవ్‌ కట్టా మాట్లాడుతూ "నేను మణిశర్మగారితో చాలా రోజుల నుంచి ట్రావెల్‌ అవుదామని అనుకుంటున్న సమయంలో 'రిపబ్లిక్‌' సినిమాకు కుదిరింది. చాలా హ్యాపీగా ఉంది. లిరిక్‌ రైటర్‌ రెహమాన్‌ మంచి సాహిత్యాన్ని అందించాడు  అన్నారు. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ మాట్లాడుతూ "సాయితేజ్‌తో తొలిసారి కలిసి పనిచేస్తున్నాను. దేవ్‌ కట్టాగారితో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది" అన్నారు. 

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ మాట్లాడుతూ "గానా ఆఫ్‌ రిపబ్లిక్‌' సాంగ్‌ను పెద్ద స్క్రీన్‌పై చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కచ్చితంగా మా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నాం. దేవ్‌ కట్టా నాకు ఒక మంచి సినిమాను ఇచ్చారు. మణిశర్మగారితో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమాతో మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇకపై ఆయనతో చాలా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అన్నారు. 

డైరెక్టర్‌ కొరటాల శివ మాట్లాడుతూ "'రిపబ్లిక్‌'లో సాంగ్‌ రిలీజ్‌ చేయడాన్ని హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాను. స్వేచ్చ గురించి చెప్పే సాంగ్‌.. చాలా బావుంది. ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. నిర్మాతలు భగవాన్‌, పుల్లారావుగారు..మిర్చి సినిమా నుంచి పరిచయం. వారికీ సినిమా చాలా పెద్ద సినిమా కావాలి. 

దేవ్‌ కట్టా గురించి చెప్పాలంటే.. ఆయన ప్రస్థానం సినిమా నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఓ విషయాన్ని ఎంత బలంగా నమ్ముతారో, అంతే బలంగా చెబుతారు. ఇన్‌టెన్స్‌ ఫిల్మ్‌ మేకర్. సింపుల్‌ ఎక్స్‌ప్రెషన్‌ను కూడా ఇన్‌టెన్స్‌తో చెబుతారు. అందరినీ ఆలోచింపచేసే పాయింట్‌ను ఈ సినిమాలో చెబుతారని ఆశిస్తున్నాను. 

మణిశర్మగారితో పనిచేయడం ఆలస్యమైనా ఇప్పుడు కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా అనిపిస్తుంది. ఆయన్ని అందరూ మెలోడి బ్రహ్మ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడర్థమైంది. సాయితేజ్‌ నాకు బ్రదర్‌లాంటోడు. తనతో చిన్న ఎమోషనల్‌ కనెక్ట్‌ ఎప్పుడూ ఉంటుంది. 

తనకు సక్సెస్‌ వస్తే నాకు సక్సెస్‌ వచ్చినట్లు ఫీల్‌ అవుతాను. తను చేసే సినిమాలన్నీ సక్సెస్‌లు సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.    

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?