ఓ బేబీ సోషియో ఫాంటసీనా?

డెభై ఏళ్ల మనసు, పాతికేళ్ల శరీరం ఈ కాన్సెప్ట్ తో తయారవుతున్నట్లు కనిపిస్తోంది ఓ బేబీ సినిమా. సమంత, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్ లు కీలకపాత్ర ధారులు. ఈ సినిమా కీలక పాయింట్ మీద…

డెభై ఏళ్ల మనసు, పాతికేళ్ల శరీరం ఈ కాన్సెప్ట్ తో తయారవుతున్నట్లు కనిపిస్తోంది ఓ బేబీ సినిమా. సమంత, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్ లు కీలకపాత్ర ధారులు. ఈ సినిమా కీలక పాయింట్ మీద ఇన్నాళ్లు క్లారిటీ ఎవ్వరికీ లేదు. డెభై ఏళ్ల బామ్మ, పాతికేళ్ల అమ్మాయిలా ఎలా మారింది? లాజికల్ గా ఎలా వుంటుంది అన్నది బయటకు రాలేదు.

అయితే ట్రయిలర్ లో క్లారిటీ వచ్చేసింది. ఓ రాత్రివేళ మెరుపు మెరిసింది, బామ్మ బేబీ కాస్తా యంగ్ బేబీగా మారిందని రాజేంద్ర ప్రసాద్ పాత్ర చేత చెప్పించారు. బేబీ టైటిల్ సాంగ్ కూడా అలాగే వుంది. ''..ఏదో ఉల్క నేరుగా భూమి మీద వాలగా,, బేబీ అవతరించేగా..' అంటూ… డెభై ఏళ్ల బామ్మ అని తెలియక, పాతికేళ్ల అమ్మాయిగా కనిపించే సమంత చుట్టూ అబ్బాయిలు తిరుగడం, కానీ ఆమెకు తనేంటో తన మనసేంటో తెలిసి, మసులుకోవడం దీంట్లోంచి పుట్టే కామెడీ వరకు బాగానే వుంది ట్రయిలర్.

కానీ రాజేంద్రప్రసాద్ ఓవర్ యాక్షన్ ఎపిసోడ్ లు మాత్రం సినిమాలో ఏమేరకు వున్నాయో తెలియదు. ట్రయిలర్ లో మాత్రం కాస్త డౌట్ అనిపించేలా వున్నాయి. టోటల్ గా ట్రయిలర్ ప్రామిసింగ్ గానే కనిపిస్తోంది. ఫన్ బాగానే జనరేట్ చేసేలావుంది. 'మంచం ఎక్కితే మగాడిలా చెలరేగిపోవాలి' లాంటి లైట్ అడల్ట్ టచ్ డైలాగులు లైటర్ ఫన్ పండించేలాగే వున్నాయి. అలాగే సినిమాను కాస్త హార్ట్ టచింగ్ సీన్లతో సినిమాను ఎండ్ చేసినట్లు కనిపిస్తోంది.

మొత్తంమీద పోస్ట్ సమ్మర్ లో ఓ మాంచి ఫన్, ఫ్యామిలీ సినిమా వస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రయత్నాలు ఆపని అఖిలప్రియ.. మరి జగన్ కరుణిస్తాడా?