ఫీల్ గుడ్ డైరక్టర్ శేఖర్ కమ్ముల-హీరో నాగచైతన్య–సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమా వస్తోందంటూ గ్రేట్ ఆంధ్ర ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ అయింది. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి సెట్ మీదకు వెళ్లబోతోంది.
ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి ఏకంగా బల్క్ డేట్ లు నాగచైతన్య కేటాయించడం విశేషం. అందువల్ల సినిమాను ఏకబిగిన షూట్ చేసి, డిసెంబర్ చివరివారంలో విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో నాగచైతన్య కూడా మిగిలిన సినిమాలు పక్కనపెట్టి, ఏకబిగిన డేట్ లు కేటాయించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి బంగార్రాజు సినిమా కూడా చైతన్య చేయాల్సి వుంది. అయితే ఆ సినిమా కూడా ప్రారంభించి, నాగార్జున, రమ్యకృష్ణ తదితరుల సీన్లు చేసుకుంటూ వెళ్తారు. తరువాత చైతన్య జాయిన్ అవుతాడు. ఈ లెక్కన చూసుకుంటే బంగార్రాజు సినిమా సంక్రాంతికి విడుదల వుండనట్లే కనిపిస్తోంది.