Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అప్పుడు సీరియస్.. ఇప్పుడు కామెడీ

అప్పుడు సీరియస్.. ఇప్పుడు కామెడీ

అక్షర. నందిత శ్వేత హీరోయిన్ గా మధు, అజయ్ ఘోష్ తదితరులతో తీసిన, తీస్తున్న సినిమా. అప్పుడేప్పుడో సినిమా షూట్ స్టార్ట్స్ అంటూ ఓ టీజర్ వదిలారు. పక్కా సీరియస్ టీజర్ అది. ఓ సూసైడ్, ఓ మర్డర్ సింబాలిక్ షాట్ లు వేసి ఆ టీజర్ అప్పట్లో వదిలారు. ఇది జరిగి చాలానెలలు అయింది.

ఇప్పుడు మళ్లీ ప్రీరిలీజ్ టీజర్ వచ్చింది. ఈసారి పక్కా కామెడీగా కట్ చేస్తూ, సీరియస్ టచ్ ఇచ్చారు. అజయ్ ఘోష్ మంచి నటుడు. ఏ పాత్ర అయినా బాగానే పండిస్తాడు. ఈసారి కామెడీ పాత్ర దొరికినట్లుంది బాగానే చేసాడు.

ఫస్ట్ టీజర్ ను స్ట్రయిట్ టు ది సబ్జెక్ట్ అన్నట్లు కట్ చేస్తే, ఈసారి టీజర్ ను అరౌండ్ ది బుష్ అన్నట్లు కట్ చేసారు. ఇంక టీజర్లు ఆపి ట్రయిలర్, సినిమా ఎప్పుడు తీసుకువస్తారొ? ఈ సినిమాకు చిన్ని కృష్ణ దర్శకుడు.

ప్రయత్నాలు ఆపని అఖిలప్రియ.. మరి జగన్ కరుణిస్తాడా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?