కోమటిరెడ్డి రూటు అటే.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా?

భారతీయ జనతా పార్టీ మీద మక్కువ పెంచుకున్నట్టుగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ విషయాన్ని ఆయనే బయటకు చెప్పారు. తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీనే అని…

భారతీయ జనతా పార్టీ మీద మక్కువ పెంచుకున్నట్టుగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ విషయాన్ని ఆయనే బయటకు చెప్పారు. తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీనే అని ఆయన తేల్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై తన అసమ్మతిని ప్రకటించారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు నోటీసులు కూడా ఇచ్చారట. షోకాజ్ నోటీసు జారీ చేసినట్టుగా టీపీసీసీ ప్రకటించింది.

దానికి సమాధానంగా తన రాజీనామా పత్రాన్ని పంపించనున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్న విషయాన్ని ఆయన తెలియజేయనున్నారట. మరి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే కుదరకపోవచ్చు. ఆయన ఫిరాయిస్తే కాంగ్రెస్ వాళ్లు ఆయనపై స్పీకర్ కు ఫిర్యాదు చేయవచ్చు.

అయితే ఆల్రెడీ తెలంగాణ స్పీకర్ వద్ద ఫిరాయింపులపై కంప్లైంట్లు బోలెడన్ని ఉన్నాయి. వాటిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ చేసే ఫిర్యాదు కూడా ఒకటిగా నిలవొచ్చు. అయితే రాజగోపాల్ రెడ్డి అలా కాకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉప ఎన్నికలను ఎదుర్కొనడానికి కూడా ఆయన రెడీ కావాల్సి ఉంటుందేమో!

ప్రయత్నాలు ఆపని అఖిలప్రియ.. మరి జగన్ కరుణిస్తాడా?