హరి హర…ఏదో విధంగా..

పవన్ కళ్యాణ్ కోసం వైవిధ్య మాంచి రాబిన్ హుడ్ టైపు సబ్జెక్ట్ రెడీ చేసి రంగంలోకి దిగారు దర్శకుడు క్రిష్. కానీ విధి వక్రించింది. ఆ సినిమాకు నిర్మాత ఎఎమ్ రత్నం కావడం ఆయన…

పవన్ కళ్యాణ్ కోసం వైవిధ్య మాంచి రాబిన్ హుడ్ టైపు సబ్జెక్ట్ రెడీ చేసి రంగంలోకి దిగారు దర్శకుడు క్రిష్. కానీ విధి వక్రించింది. ఆ సినిమాకు నిర్మాత ఎఎమ్ రత్నం కావడం ఆయన ఇబ్బందులు ఆయనకు వుండడం ఓ సమస్య. 

క్రిష్ తలపెట్టిన భారీ పైట్లు, గ్రీన్ మ్యాట్ రోప్ యాక్షన్ సీన్లు, డ్యాన్స్ లు చేయడం పవన్ కళ్యాణ్ వల్ల కాకపోవడం మరో సమస్య. మొత్తం మీద ఈ సినిమా అలా ముక్కుతూ మూలుగుతోంది. ఈ సినిమా ఏదో విధంగా పూర్తయితే నిర్మాత ఎఎమ్ రత్నం కాస్తయినా తేరుకుంటారు. అలాగే ఈ సక్సెస్ అయితే మహానాయకుడు, కథనాయకుడు, కొండపొలం సినిమాలు ఇచ్చిన షాక్ నుంచి క్రిష్ బయటపడతారు. కానీ ఇదే జ‌రిగేలా కనిపించడం లేదు.

పవన్ కళ్యాణ్ రాజ‌కీయ కార్యక్రమాలు ఓ పక్క, ఈ సినిమా వుండగానే వేరు వేరు సినిమాలు ఒప్పేసుకుని, అవన్నీ మీద వేసుకోవడం మరోపక్క ఇబ్బంది పెడుతున్నాయి. హరిహరవీరమల్లు విషయంలో క్రిష్ దే తప్పు అంతా అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం ఆ మధ్య కొంత జ‌రిగినట్లు కనిపించింది. క్వాలిటీ అప్ టు ది మార్క్ లేదని, ఇంకా ఇంకా వార్తలు బయటకు వచ్చాయి. కానీ అసలు కారణం అది కాదని, అంత వీర లెవెల్ ఫైట్లు, పాటలు చేయడానికి పవన్ సుముఖంగా లేకపోవడమే అని కూడా వినిపిస్తోంది.

మొత్తానికి ఇప్పుడు ఏదో విధంగా ఈ సినిమాను బయటపడేసి తన తప్పు లేదని అనిపించుకొవాలని పవన్ చూస్తున్నారని తెలుస్తోంది. వీలయినంత వరకు యాక్షన్ ను కుదించి, పాటల్లో డ్యాన్స్ లు తగ్గించి సినిమాను ఫినిష్ చేసే ఆలోచనలో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో నిజ‌మెంతో తెలియదు కానీ, ఏదో విధంగా సినిమా అంటూ బయటకు వస్తే నిర్మాత, దర్శకుడు ‘హమ్మయ్య’ అని అనుకోవడం మాత్రం ఫిక్స్.