కార్తికేయ 2 నిర్మాత ఎవరు?

చిత్రంగా అనిపిస్తోంది కదూ ఈ ప్రశ్న వింటే. సినిమా విడుదలైన తరువాత ఎక్కడ చూసినా అభిషేక్ అగర్వాల్ పేరే వినిపిస్తోంది. ఆయనే కనిపిస్తున్నారు. చాలా చొట్ల మీడియా ఆయన పేరు మాత్రమే రాస్తోంది. కానీ…

చిత్రంగా అనిపిస్తోంది కదూ ఈ ప్రశ్న వింటే. సినిమా విడుదలైన తరువాత ఎక్కడ చూసినా అభిషేక్ అగర్వాల్ పేరే వినిపిస్తోంది. ఆయనే కనిపిస్తున్నారు. చాలా చొట్ల మీడియా ఆయన పేరు మాత్రమే రాస్తోంది. కానీ నిజానికి ఈ సినిమాకు అభిషేక్ అగర్వాల్ కూడా ఓ భాగస్వామి మాత్రమే. సినిమా నిర్మాణంలో ఆయన కూ వాటా వుంది. కానీ మిగిలిన వారికి కూడా వుంది..

సినిమాకు ప్రధాన భాగస్వామి టిజి విశ్వప్రసాద్. ఆయన వాటా సగానికి సగం.. సినిమాకు ఫండింగ్ కూడా ఆయనదే అని తెలుస్తోంది. ఈ ఇద్దరు కూడా కాకుండా సినిమాకు మరో నిర్మాత కూడా వున్నారు. వివేక్ కూచిభొట్ల. ఆయన కు అగర్వాల్ తో సమానమైన వాటా వుంది.. అంటే మొత్తం ముగ్గురు నిర్మాతలు రిస్క్ తీసుకుని నిర్మించారు.

ఇక్కడ ఇంకో విషయం కూడా వుంది. దర్శకుడు, హీరో కూడా లాభాల్లో వాటా దారులే. లాభాల్లో వాటా ప్రాతిపదికన వారు ఈ సినిమా చేసారు. అయితే వివేక్ కూచిభొట్ల చాలా సైలంట్ గా వుంటారు. ప్రచారానికి దూరం. స్టేజ్ మీదకు కూడా రారు. టిజి విశ్వప్రసాద్ కూడా వీలయినంత తక్కువగా కనిపిస్తారు. 

ఇక మిగిలిన అభిషేక్ అగర్వాల్ ఈ విషయంలో చాలా స్పీడ్. అందుకనే ఆయనే నిర్మాతగా కనిపిస్తున్నారు. అంతా అనుకుంటూ అదే రాస్తున్నారు.