కొత్త కొత్త కథల కోసం కొత్త కొత్త పాయింట్లు వెదుకుతున్నారు కథకులు. అనుష్క-నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో తయారుకాబోతున్న సినిమాకు ఇలాంటి కొత్త పాయింట్ నే పట్టుకున్నారని తెలుస్తోంది.
పెళ్లి అంటే ఇష్టం లేని అమ్మాయి, తల్లి కావడం కోసం ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజేషన్ పద్దతిని ఎంచుకోవాలనుకుంటుదని బోగట్టా. అయితే అందుకు సరైన క్వాలిటీలు వున్నవాడైతే బెటర్ అని స్టాండప్ కమెడియన్ అయిన నవీన్ ను ఎంచుకుని, వీర్యదానం చేయించుకుంటుంది.
కానీ ఆ తరువాత ఏమయింది అన్నది మనకు తెలియదు. సినిమా చూడాల్సిందే. చిత్రమేమిటంటే ఇదేదో కొరియన్ సినిమాను కొట్టుకొచ్చిన పాయింట్ అని టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే దాదాపు ఇదే పాయింట్ మరో తెలుగు సినిమా కూడా రెడీ అవుతోంది. అది దాదాపు సగానికి పైగా పూర్తి కావచ్చింది. ముందుగా అదే విడుదల అవుతుంది కూడా.
ఏ పాయింట్లు దొరక్క సర్రోగసీ, ఇంపోటెన్సీ ఇలాంటి కూడా పట్టుకుంటున్నారు. అన్నట్లు ఇంపోటెన్సీ (మగతనం లేకపోవడం) అనే పాయింట్ బేస్ చేసుకుని కూడా రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి.
ఈ రెండూ సగం వరకు రెడీ అయ్యాయి. ఈ రెండింటిలో ఇద్దరు మిడ్ రేంజ్ యంగ్ హీరోలు నటిస్తున్నారు.