రామ్ @ 15 లింగుస్వామి @ 6 కోట్లు

ఓక పక్క కరోనా కల్లోలంతో టాలీవుడ్ భవిష్యత్ అగమ్యంగా వున్నా కూడా మరోపక్క హీరోల రెమ్యూనిరేషన్లు ఆకాశాన్నంటుతున్నాయి.  Advertisement నాన్ థియేటర్ హక్కుల ఆదాయం పెరగడంతో ఆ మేరకు హీరోలు రెమ్యూనిరేషన్ రూపంలో లాగేస్తున్నారు.…

ఓక పక్క కరోనా కల్లోలంతో టాలీవుడ్ భవిష్యత్ అగమ్యంగా వున్నా కూడా మరోపక్క హీరోల రెమ్యూనిరేషన్లు ఆకాశాన్నంటుతున్నాయి. 

నాన్ థియేటర్ హక్కుల ఆదాయం పెరగడంతో ఆ మేరకు హీరోలు రెమ్యూనిరేషన్ రూపంలో లాగేస్తున్నారు. లేటెస్ట్ గా తను చేస్తున్న సినిమాకు హీరో రామ్ ఏకంగా 12 కోట్లు ప్లస్ లాభాల్లో చిరువాటా లేదా మూడు కోట్లు అదనంగా అనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు పదిహేను కోట్లు రెమ్యూనిరేషన్ అన్నమాట.

ఇదే సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్న లింగుస్వామి రెమ్యూనిరేషన్ ఆరు కోట్లు. సినిమాకు కథ కూడా ఆయనే సమకూరుస్తున్నారు. ఎప్పుడో ఆవారా సినిమా తరువాత మళ్లీ హిట్ కొట్టలేదు లింగుస్వామి. కానీ రెమ్యూనిరేషన్ మాత్రం ఆరు కోట్లు.

ఇక ఇదే సినిమాకు పని చేస్తున్న మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీప్రసాద్ కు మూడున్నర కోట్ల రెమ్యూనిరేషన్. హీరో కృతి శెట్టికి కోటి రూపాయలు. ఇలా మొత్తానికి యాక్టింగ్, టెక్నికల్ క్రూ అంతా కలిసి 28 కోట్ల వరకు రెమ్యూనిరేషన్లే అవుతున్నాయట. ఇక ప్రొడక్షన్ కు మరో ఇరవై కోట్లు. అంటే దాదాపు సినిమా విడుదల నాటికి యాభై అవుతుందన్నమాట.

నాన్ థియేటర్ హక్కులు పాతిక కోట్ల వరకు వస్తాయని, మిగిలినది థియేటర్ మీద నుంచి రావాల్సి వుంటుందని లెక్కలు కట్టుకుంటున్నట్లు బోగట్టా. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో రెడీ కాబోతోంది ఈ సినిమా.