జగన్ కోసం బాలయ్య వెయిటింగ్!

రెండురోజులుగా కొన్ని గ్యాసిప్ లు ఇండస్ట్రీ నిర్మాతల సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ నేరుగా సిఎమ్ జగన్ తో మాట్లాడారని, వచ్చి కలుస్తా అన్నారని అన్నది ఓ గ్యాసిప్. Advertisement మహేష్ బాబు స్వయంగా…

రెండురోజులుగా కొన్ని గ్యాసిప్ లు ఇండస్ట్రీ నిర్మాతల సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ నేరుగా సిఎమ్ జగన్ తో మాట్లాడారని, వచ్చి కలుస్తా అన్నారని అన్నది ఓ గ్యాసిప్.

మహేష్ బాబు స్వయంగా వెళ్లి జగన్ ను కలుస్తా అన్నరన్నది మరో గ్యాసిప్.

చిరంజీవి నేరుగా జగన్ తో మాట్లాడి కలుస్తా అన్నారని, పులివెందుల టూర్ అయిన తరువాత కలుద్దామని అన్నారని ఇంకో గ్యాసిప్.

కానీ విచారిస్తే ఇవన్నీ పక్కా గ్యాసిప్ లు అని తెలుస్తోంది. వీటి వైనాలు ఇలా వున్నాయని అసలు విషయాలు వినిపిస్తున్నాయి.

బాలయ్య ఏడాది కాలం కిందటే జగన్ అపాయింట్ మెంట్ అడిగారని బోగట్టా. ఎప్పుడు ఇస్తే అప్పుడు కలిసే ఆలోచనలో వున్నారట అప్పటి నుంచి. అంతే తప్ప ఇప్పుడు కొత్తగా అపాయింట్ మెంట్ అడగలేదని తెలుస్తోంది.

మహేష్ బాబు వెళ్లి జగన్ ను కలుస్తా అన్నది నిజమే అని బోగట్టా. అయితే అది ఆయన కు ఆయన అన్నది కాదట. కొంతమంది ఇండస్ట్రీ జనాలు వెళ్లి జగన్ ను కలవబోతున్నారని తెలిసి, అలా వెళ్తే తాను కూడా వాళ్లతో కలిసి వెళ్లడానికి అభ్యంతరం లేదని మహేష్ అన్నట్లు తెలుస్తోంది.

ఇక చిరు సంగతి మాత్రం ఎవరికీ తెలియదు. ఆయన మాట్లాడారా? లేదా? అన్నది ఆయనకే తెలియాలని తెలుస్తోంది. మొత్తం మీద ఇండస్ట్రీలో ఇప్పుడు ఆంధ్ర సిఎమ్ జగన్ ను కలవడం, టికెట్ రేట్ల విషయం అన్నది హాట్ టాపిక్ గా వుంది.